విద్యారంగాన్ని కాపాడుకోవాలి

  మనతెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ 19 సంక్షోభంతో అనేక రంగాలతో పాటు విద్యారంగం కూడా దెబ్బతిన్నదని, విద్యార్ధుల భవిష్యత్‌కు కీలకమైన విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నాణ్యమైన చదువు, ఉద్యోగితా నైపుణ్యాల అభివృద్ధితోనే ప్రస్థుత సంక్షోభంలో పోటీ ప్రపంచంలో రాణించగలమని చెప్పారు. విద్యార్ధులను ఆ విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపైన ఉందని పేర్కొన్నారు. “కోవిడ్ సంక్షోభం : విద్యారంగంపై ప్రభావం అన్న అంశంపై శనివారం జరిగిన గ్లోబల్ వెబినార్‌లో గవర్నర్ ముఖ్య అతిధిగా […] The post విద్యారంగాన్ని కాపాడుకోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ 19 సంక్షోభంతో అనేక రంగాలతో పాటు విద్యారంగం కూడా దెబ్బతిన్నదని, విద్యార్ధుల భవిష్యత్‌కు కీలకమైన విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నాణ్యమైన చదువు, ఉద్యోగితా నైపుణ్యాల అభివృద్ధితోనే ప్రస్థుత సంక్షోభంలో పోటీ ప్రపంచంలో రాణించగలమని చెప్పారు. విద్యార్ధులను ఆ విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపైన ఉందని పేర్కొన్నారు. “కోవిడ్ సంక్షోభం : విద్యారంగంపై ప్రభావం అన్న అంశంపై శనివారం జరిగిన గ్లోబల్ వెబినార్‌లో గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

భారతీయ సంసృతి, సంప్రదాయాలలో తరతరాలుగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఈ సంక్షోభ సమయంలోనూ విద్యార్ధులు పరిమిత వనరులతోనే ఆన్‌లైన్ లో విద్యాభ్యాసం చేయడానికి ఉత్సాహం చూపారని గవర్నర్ ప్రశంసిచారు. ఆన్‌లైన్ విద్యాభ్యాసంలో పేదలు వెనకపడకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పారు. ఆన్‌లైన్ క్లాసులు కేవలం 60 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నామని, మిగతా 40 శాతం మందికి విద్య దూరం కాకుండా చూడాలని తెలిపారు.

విద్యార్ధులు కళాశాలను, స్నేహితులను ఎంతగానో మిస్ అవుతున్నందున, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి తల్లితండ్రులు, టీచర్లు సమిష్ఠిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ విద్యను అందుకోలేని వారికి డిజటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ అంతర్జాతీయ వెబినార్‌ను లీడ్ ఇండియా ఫౌండేషన్ (అమెరికా విభాగం) ఛైర్మన్ డాక్టర్ హరి ఎప్పనపల్లి నిర్వహించగా, ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య వక్తగా రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. మొత్తం 17 దేశాల నుండి వందలాది మంది ఈ వెబినార్‌లో భాగస్వాములయ్యారు.

Governor speech on online classes in global webinar

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విద్యారంగాన్ని కాపాడుకోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: