కమ్మేస్తున్న కరోనా

  దేశంలో ఒక్క రోజే దాదాపు 23 వేల కేసులు 442 మంది మృతి తమిళనాడులో లక్ష దాటిన కేసులు రోజురోజుకు మెరుగుపడుతున్న రికవరీ రేటు న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ దాదాపు 20 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం దాకా గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,771 కరోనా పాజిటివ్ కేలు నమోదయినట్లు కేంద్ర […] The post కమ్మేస్తున్న కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశంలో ఒక్క రోజే దాదాపు 23 వేల కేసులు
442 మంది మృతి
తమిళనాడులో లక్ష దాటిన కేసులు
రోజురోజుకు మెరుగుపడుతున్న రికవరీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ దాదాపు 20 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం దాకా గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,771 కరోనా పాజిటివ్ కేలు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 6,48, 315కు చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 18,655కు చేరుకుంది.

దేశంలో కరోనానుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,94,226గా ఉండగా, 2,35, 433 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఓ వైపు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుండడం ఊరట కలిగిస్తున్న అంశం. దేశంలో రికవరీ రేటు 60.80గా ఉందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశంలో ఈనెల 3 వరకు మొత్తం 95,40,132 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి( ఐసిఎంఆర్) తెలిపింది. 3వ తేదీన 2,42, 383 శాంపిల్స్‌ను పరీక్షించారు. దేశంలో 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరసగా ఇది రెండో రోజు. జూన్ 1వ తేదీనుంచి ఇప్పటివరకు దేశంలో 4,57, 780 కేసులు పెరిగాయి.

తమిళనాడులో లక్షదాటిన కేసులు
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా రాష్టంలో 6 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్ద పడుతోంది. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 6 వేల కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,92,990కి చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 8,376 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సైతం రాష్ట్రంలో 198 మంది వైరస్‌కు బలయ్యారు. ఇక తమిళనాడులోను ప్రతి రోజూ 4 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 4,329 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,02, 721కు చేరుకుంది.

మహారాష్ట్ర తర్వాత లక్ష కేసులు నమోదయిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,385 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సైతం రాష్ట్రంలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోను కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. శనివారం ఉదయానికి అక్కడ 94, 695 పాజిటివ్ కేసులుండగా, ఇప్పటివరకు 2,923 మంది మృతి చెందారు. కర్నాటక, గుజరాత్, యుపి, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోను కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్యలో ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఒకటి, రెండు రోజుల్లోనే రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకునే ప్రమాదం ఉంది.

32 మంది టెన్త్ విద్యార్థులకు కరోనా
బెంగళూరులో శుక్రవారం టెన్త్ పరీక్షలు రాసిన 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు కర్నాటకలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 80 శాతం ఒక్క బెంగళూరు నగరంలోనే వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రభుత్వం శనివారం సాయంత్రంనుంచి సోమవారం ఉదయం దాకా నగరంలో పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

India reports 22,771 new cases, 442 deaths in a day

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కమ్మేస్తున్న కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: