రౌడీ షీటర్ వికాస్‌దూబే ఇంటి కూల్చివేత

  కాన్పూర్: రౌడీ షీటర్ వికాస్‌దూబే ఇంటిని కూల్చి వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బితూర్‌లోని దూబేకు చెందిన ఇంటిని బుల్డోజర్లతో కూల్చి వేశారు. శనివారం కాన్పూర్ జిల్లా అధికారులు, సాయుధ పోలీసులతో వెళ్లి కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శిథిలాల మీదుగా జెసిబిలు వెళ్లడం, దూబేకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేయడం, పై కప్పులు తొలగించిన ఖాళీ గదులు వీడియో దృశ్యాల్లో కనిపించాయి. శుక్రవారం వికాస్‌దూబేను పట్టుకునేందుకు బిక్రూ గ్రామంలోని అతని నివాసం […] The post రౌడీ షీటర్ వికాస్‌దూబే ఇంటి కూల్చివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కాన్పూర్: రౌడీ షీటర్ వికాస్‌దూబే ఇంటిని కూల్చి వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బితూర్‌లోని దూబేకు చెందిన ఇంటిని బుల్డోజర్లతో కూల్చి వేశారు. శనివారం కాన్పూర్ జిల్లా అధికారులు, సాయుధ పోలీసులతో వెళ్లి కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శిథిలాల మీదుగా జెసిబిలు వెళ్లడం, దూబేకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేయడం, పై కప్పులు తొలగించిన ఖాళీ గదులు వీడియో దృశ్యాల్లో కనిపించాయి. శుక్రవారం వికాస్‌దూబేను పట్టుకునేందుకు బిక్రూ గ్రామంలోని అతని నివాసం వద్దకు వెళ్తున్న పోలీసులపై అతని ముఠా ఓ దాబాపై నుంచి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

ఆ ఘటనలో ఓ డిఎస్‌పి, ముగ్గురు ఎస్‌ఐలుసహా 8మంది పోలీసులు మృతి చెందారు. ఘటన జరుగుతున్న సమయంలో తప్పించుకుపోయిన చౌబేపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఒ) వినయ్ తివారీని అధికారులు సస్పెండ్ చేశారు. సంఘటన సమయంలో ఎస్‌హెచ్‌ఒ అక్కడే ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కాన్పూర్ ఐజి మోహిత్ అగర్వాల్ అన్నారు. దూబేను పట్టుకునేందుకు పోలీస్ బృందం వస్తున్న సమాచారాన్ని ఆ ముఠాకు చేరవేసినట్టుగా తివారీపై అనుమానాలున్నాయి. కరడుగట్టిన నేరస్థుడిగా పేరున్న వికాస్‌దూబేపై హత్యలుసహా 60 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Gangster Vikas Dubey House Demolished in Bikaru

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రౌడీ షీటర్ వికాస్‌దూబే ఇంటి కూల్చివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: