7 నుంచి నిమ్స్ లో కరోనాపై క్లినికల్ ట్రయల్స్

హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీ నుంచి నిమ్స్ ఆసుపత్రిలో కరోనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్ తెలిపారు. శనివారం మనోహర్ మీడియాతో మాట్లాడారు. తమ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ కు  ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ కు చాలా మంది సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారి ఆరోగ్య పరిస్థితిపై సంపూర్ణంగా పరీక్షలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. క్లినికల్ పరీక్షల్లో మొదటి […] The post 7 నుంచి నిమ్స్ లో కరోనాపై క్లినికల్ ట్రయల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీ నుంచి నిమ్స్ ఆసుపత్రిలో కరోనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్ తెలిపారు. శనివారం మనోహర్ మీడియాతో మాట్లాడారు. తమ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ కు  ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ కు చాలా మంది సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారి ఆరోగ్య పరిస్థితిపై సంపూర్ణంగా పరీక్షలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. క్లినికల్ పరీక్షల్లో మొదటి దఫా 28 రోజులు ఉంటుందని, వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం రెండు  రోజుల పాటు సదరు వ్యక్తిని ఆసుపత్రిలోనే ఉంచి పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరోనా నివారణ వ్యాక్సిన్ ను వచ్చే నెల 15వ తేదీ నాటికి తయారు చేయాలన్న పట్టుదలతో ఐసిఎంఆర్ ఉంది. వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే అంశంపై హైదరాబాద్ లోని బయోటెక్, పుణేలోని ఎస్ఐవి సంయుక్తంగా పని చేస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారు చేసే కోవ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించేందుకు డిసిజిఐ అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలోని 12 ప్రాంతాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని ఐసిఎంఆర్ నిర్ణయం తీసుకుంది. నిమ్స్ తో పాటు ఎపిలోని విజయనగరం కెజిహెచ్ లో కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తారు. ఇప్పటికే యానిమల్ క్లినికల్  ట్రయల్స్ నిర్వహించారు. ఎలుకలు, కుందేళ్లపై ఈ క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించి విజయవంతమయ్యారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 7 నుంచి నిమ్స్ లో కరోనాపై క్లినికల్ ట్రయల్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: