రష్యాపై కరోనా ఎఫెక్ట్ : 10వేలు దాటిన మృతుల సంఖ్య

మాస్కో: రష్యాపై కరోనా తన ప్రభావాన్ని అధికంగానే చూపింది. ఈ దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా అదుపులోకి వస్తోంది. రష్యాలో ఒక్కరోజులోనే 6,632 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. గత తొమ్మిది రోజులుగా ఏడు వేల కంటే తక్కువ కరోనా కేసులే నమోదవుతున్నాయని యాంటీ కరోనా వైరస్ క్రైసిస్ రెస్పాన్స్  సెంటర్ అధికారులు తెలిపారు. ఈ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య   6,74,515కు చేరుకుందని వారు వెల్లడించారు. గడిచిన ఐదు రోజుల నుంచి కరోనా వృద్ధి […] The post రష్యాపై కరోనా ఎఫెక్ట్ : 10వేలు దాటిన మృతుల సంఖ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మాస్కో: రష్యాపై కరోనా తన ప్రభావాన్ని అధికంగానే చూపింది. ఈ దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా అదుపులోకి వస్తోంది. రష్యాలో ఒక్కరోజులోనే 6,632 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. గత తొమ్మిది రోజులుగా ఏడు వేల కంటే తక్కువ కరోనా కేసులే నమోదవుతున్నాయని యాంటీ కరోనా వైరస్ క్రైసిస్ రెస్పాన్స్  సెంటర్ అధికారులు తెలిపారు. ఈ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య   6,74,515కు చేరుకుందని వారు వెల్లడించారు. గడిచిన ఐదు రోజుల నుంచి కరోనా వృద్ధి చరేటు ఒక్క శాతానికి మించలేదని వారు వెల్లడించారు. అయితే ఒక్క రోజులోనే 168 మంది కరోనా బారిన పడి చనిపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 10,027కు చేరుకుంది. ప్రస్తుతం 2,17,609 మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రష్యాపై కరోనా ఎఫెక్ట్ : 10వేలు దాటిన మృతుల సంఖ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: