సిఐఎకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సిఐఎకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిఐఎ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ఇప్పటికే కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ తయారీ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు, సాగునీరు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలతో సిఐఎకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కరోనా వల్ల అన్ని రంగాలపై కొంత ప్రభావం పడిందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధే ప్రాధాన్యతలుగా […] The post సిఐఎకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం: కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సిఐఎకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిఐఎ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ఇప్పటికే కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ తయారీ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు, సాగునీరు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలతో సిఐఎకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కరోనా వల్ల అన్ని రంగాలపై కొంత ప్రభావం పడిందన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధే ప్రాధాన్యతలుగా పాలన సాగుతోందని కెటిఆర్ స్పష్టం చేశారు. వలస కార్మికులను తెలంగాణ అతిధి కార్మికులుగా పేర్కొన్నమన్నారు. ఎక్స్‌కాన్ వంటి కార్యక్రమాన్ని సిఐఎ హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు. సిఐఎ సవాళ్లు, అవకాశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మనిర్భర్, మేకిన్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా స్వదేశీ రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టును సిఐఎ అభినందించింది. మౌళిక వసతుల కల్పనలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉందని సిఐఎ ప్రశంసించింది.

The post సిఐఎకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం: కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: