టివి నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్

హైదరాబాద్ : ప్రముఖ టివి నటుడు రవికృష్ణకు కరోనా సోకింది. రవికృష్ణ బిగ్ బాస్3 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రవికృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో తాను గత మూడు రోజులుగా ఇంట్లోనే క్వారంటైన్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వెల్లడించారు. తనతో కలిసి నటించిన నటీనటులు కరోనా పరీక్షలు చేయించకోవాలని ఆయన సూచించారు. తెలుగు సీరియల్ ’మొగలి రేకులు‘ […] The post టివి నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ టివి నటుడు రవికృష్ణకు కరోనా సోకింది. రవికృష్ణ బిగ్ బాస్3 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రవికృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో తాను గత మూడు రోజులుగా ఇంట్లోనే క్వారంటైన్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వెల్లడించారు. తనతో కలిసి నటించిన నటీనటులు కరోనా పరీక్షలు చేయించకోవాలని ఆయన సూచించారు. తెలుగు సీరియల్ ’మొగలి రేకులు‘ సినిమాతో ఆయన పరిశ్రమలో అడుగు పెట్టారు. వరూధిని పరిణయం, శ్రీనివాస కళ్యాణం, మహాలక్ష్మీ, బావా మరదల్లు వంటి సీరియళ్లలో ఆయన నటించారు. సీరియళ్లతో పాటు ఆయన పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. టివి నటి నవ్యసామికి కూడా ఇటీవల కరోనా సోకింది. రవికృష్ణ, నవ్యసామిలు కలిసి ఆమె కథ సీరియల్ లో నటించారు. కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ, సినీ, టివి సీరియళ్ల షూటింగ్ లకు తెలంగాణ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు సినిమా షూటింగ్ లు ప్రారంభం కానప్పటికీ, పలు టివి సీరియళ్ల షూటింగ్ లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టివి నటీనటులకు కరోనా సోకుతుండడంతో టివి పరిశ్రమలో ఆందోళన నెలకొంది.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post టివి నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: