2.89లక్షల బంగారు మాస్క్ ధరించిన పుణె వ్యక్తి.. వైరల్

పుణె: ప్రపంచం మొత్తాన్ని వణికిసున్న కరోనా మహమ్మారి వైరస్ సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమామాజిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని వైద్యులు చెప్పడంతో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలందరూ ముఖానికి వివిద రకాల మాస్కులను వాడుతున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా ఉండాలనుకున్నాడో ఏమో కానీ, ఏకంగా బంగారు మాస్క్‌ను ధరించి వార్తల్లో నిలిచాడు. పుణెలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి ఈ వైరస్ […] The post 2.89లక్షల బంగారు మాస్క్ ధరించిన పుణె వ్యక్తి.. వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పుణె: ప్రపంచం మొత్తాన్ని వణికిసున్న కరోనా మహమ్మారి వైరస్ సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమామాజిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని వైద్యులు చెప్పడంతో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలందరూ ముఖానికి వివిద రకాల మాస్కులను వాడుతున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా ఉండాలనుకున్నాడో ఏమో కానీ, ఏకంగా బంగారు మాస్క్‌ను ధరించి వార్తల్లో నిలిచాడు. పుణెలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి ఈ వైరస్ విజృంభిస్తున్న సమయంలో బంగారంతో మాస్క్ చేసుకొని ముఖానికి ధరిస్తున్నాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మందంగా ఉన్న బంగారు మాస్క్ కు చిన్న చిన్న రంద్రాలను చేసినట్లు అతను తెలిపాడు. ఈ మాస్క్ తయారికి రూ.2.89 లక్షలు విలువచేసే సుమారు 5తులాల బంగారాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోది. కాగా, బంగారు మాస్క్ ధరించిన శంకర్ కురాడే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pune man wears gold mask worth Rs 2.89 lakh 

The post 2.89లక్షల బంగారు మాస్క్ ధరించిన పుణె వ్యక్తి.. వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: