2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వివాదం.. విచారణను ఆపేసిన లంక ప్రభుత్వం

కొలంబో: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జరుపుతున్న విచారణను శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాఫ్తు విభాగం మధ్యలోనే నిలిపి వేసింది. సరైన సాక్ష్యాలు లేనందున విచారణను జరపడం లేదని దర్యాఫ్తు బృందం వివరించింది. శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, అరవింద డిసిల్వా తదితరులను దర్యాఫ్తు బృందం విడివిడిగా విచారించింది. అయితే విచారణలో ఫిక్సింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించక […] The post 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వివాదం.. విచారణను ఆపేసిన లంక ప్రభుత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొలంబో: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జరుపుతున్న విచారణను శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాఫ్తు విభాగం మధ్యలోనే నిలిపి వేసింది. సరైన సాక్ష్యాలు లేనందున విచారణను జరపడం లేదని దర్యాఫ్తు బృందం వివరించింది. శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, అరవింద డిసిల్వా తదితరులను దర్యాఫ్తు బృందం విడివిడిగా విచారించింది. అయితే విచారణలో ఫిక్సింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో విచారణను మధ్యలోనే నిలిపి వేసింది. ఈ విషయాన్ని శ్రీలంకకు చెందిన ఓ న్యూస్ పోర్టల్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఫిక్సింగ్‌పై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం పసలేదని, ఏ ఒక్కరూ కూడా నేరానికి పాల్పడినట్టు సంకేతాలు లభించడం లేదని దర్యాఫ్తు బృందం తన విచారణలో తేల్చిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఇక, ఈ వివాదాన్ని ఇంతటితో విడిచి పెట్టడమే మంచిదని శ్రీలంక ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి వచ్చింది.

దీంతో ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో అప్పటి శ్రీలంక క్రీడల మంత్రి మహీందనందా భారత్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను శ్రీలంక క్రికెటర్లు ఫిక్సింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం క్రిమినల్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన దర్యాఫ్తు బృందం పలువురు క్రికెటర్లను సుదీర్ఘంగా విచారించింది. ఇందులో ఫిక్సంగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో దర్యాఫ్తును అర్ధాంతరంగా నిలిపి వేశారు.

Lanka Cops drop 2011 World Cup final match fixing probe

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వివాదం.. విచారణను ఆపేసిన లంక ప్రభుత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: