జియోలోకి మరో రూ.1894 కోట్లు

  0.39% వాటా కొనుగోలు చేసిన ఇంటెల్ క్యాపిటల్ న్యూఢిల్లీ: రిలయన్స్ జియోలో పదకొండో విదేశీ కంపెనీ ఇంటెల్ క్యాపిటల్ దాదాపు రూ.1,894 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దీంతో ఇంటెల్ కార్పొరేషన్‌కు చెందిన ఇంటెల్ క్యాపిటల్ జియో ప్లాట్‌ఫామ్‌లలో 0.39 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈమేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) శుక్రవారం సమాచారం ఇచ్చింది. ఇంటెల్ క్యాపిటల్‌తో ఈ పెట్టుబడి భాగస్వామ్యం రూ.4.91 లక్షల కోట్ల ఈక్విటీ విలువతో జరిగిందని ఆర్‌ఐఎల్ తెలిపింది. జియో […] The post జియోలోకి మరో రూ.1894 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

0.39% వాటా కొనుగోలు చేసిన ఇంటెల్ క్యాపిటల్

న్యూఢిల్లీ: రిలయన్స్ జియోలో పదకొండో విదేశీ కంపెనీ ఇంటెల్ క్యాపిటల్ దాదాపు రూ.1,894 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దీంతో ఇంటెల్ కార్పొరేషన్‌కు చెందిన ఇంటెల్ క్యాపిటల్ జియో ప్లాట్‌ఫామ్‌లలో 0.39 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈమేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) శుక్రవారం సమాచారం ఇచ్చింది. ఇంటెల్ క్యాపిటల్‌తో ఈ పెట్టుబడి భాగస్వామ్యం రూ.4.91 లక్షల కోట్ల ఈక్విటీ విలువతో జరిగిందని ఆర్‌ఐఎల్ తెలిపింది. జియో ప్లాట్‌ఫామ్‌ల ఎంటర్‌ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లుగా నిర్ణయించింది. ఈ పెట్టుబడి ద్వారా ఇంటెల్ క్యాపిటల్‌కు జియో ప్లాట్‌ఫామ్‌లో 0.39% వాటా దక్కింది.

భారతదేశాన్ని డిజిటల్ సమాజంగా మార్చడానికి ఇంటెల్ సహాయం చేస్తుందని ముఖేష్ అంబానీ అన్నారు. దీని ద్వారా ఆర్‌ఐఎల్ మొత్తం రూ.1,17,588.45 కోట్లు వసూలు చేసింది. 11 కంపెనీల నుండి 12 పెట్టుబడుల ద్వారా ఈ మొత్తాన్ని సేకరించింది. ఫేస్‌బుక్ జియోలో అతిపెద్ద వాటాదారుగా ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను ఫేస్‌బుక్ రూ.43,573.62 కోట్లతో సొంతం చేసుకుంది. ఇప్పటివరకు జియో ప్లాట్‌ఫామ్‌లలో 25.09 శాతం వాటాలను ఆర్‌ఐఎల్ విక్రయించింది. ఇంటెల్ కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కంప్యూటర్ చిప్‌లను తయారు చేసే ప్రముఖ సంస్థ అనే విషయం తెలిసిందే. ఇంటెల్ క్యాపిటల్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5 జి వంటి సాంకేతిక రంగాలలో పనిచేస్తుంది.

Intel Capital to invest Rs 1,894 crore in Jio Platforms

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post జియోలోకి మరో రూ.1894 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: