విదేశీ మారక నిల్వల్లో భారత్‌కు ఐదో స్థానం

  చైనా, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా తర్వాత ఇండియా 500 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలు న్యూఢిల్లీ: భారత్ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 500 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. చైనా, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా తర్వాత భారతదేశం వద్ద అతిపెద్ద మారక నిల్వలు ఉన్నాయన్నమాట. అంటే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విదేశీ మారక నిల్వలు భారత్ వద్ద ఉన్నాయని ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశం విదేశీ మారక […] The post విదేశీ మారక నిల్వల్లో భారత్‌కు ఐదో స్థానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చైనా, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా తర్వాత ఇండియా
500 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలు

న్యూఢిల్లీ: భారత్ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 500 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. చైనా, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా తర్వాత భారతదేశం వద్ద అతిపెద్ద మారక నిల్వలు ఉన్నాయన్నమాట. అంటే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విదేశీ మారక నిల్వలు భారత్ వద్ద ఉన్నాయని ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశం విదేశీ మారక నిల్వలు దాదాపు దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో ఐదింట ఒక వంతుతో సమానం. 13 నెలల దిగుమతులను కవర్ చేయడానికి ఇవి సరిపోతాయని భావిస్తారు. ఇది దేశానికి చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఇది ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపింది. రెండు నెలలకు పైగా కఠినమైన లాక్‌డౌన్ తర్వాత భారత్ తన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఎలా పెరిగాయి?
మొదటి త్రైమాసికంలో అరుదైన కరెంట్ -అకౌంట్ మిగులు, స్థానిక స్టాక్ మార్కెట్లోకి రాకపోకలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఊపందుకున్నాయి. గత రెండు నెలల్లో రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లలో ప్రధాన పెట్టుబడులతో సహా భారతదేశ విదేశీ మారక నిల్వలు మంచి ఉత్సాహం పొందాయి. జూన్ వరకు జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు మొత్తం 25 బిలియన్ డాలర్లు విదేశీ మారక నిల్వలను సేకరించడానికి ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు దోహదం చేసింది.

ఎందుకు ముఖ్యం?
అధిక విదేశీ మారక నిల్వలు కలిగి ఉండటం మార్కెట్ అస్థిరతను నిరోధించడంలో దోహదం చేస్తుంది. ఇది ఆర్థి క దృక్పథం క్షీణతలో ఉన్నప్పటికీ ప్రభుత్వం తన రుణ బాధ్యతలను తీర్చగల విదేశీ పెట్టుబడిదారులకు, క్రెడిట్ రేటింగ్ సంస్థలకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.

విదేశీ మారక నిల్వలు అంటే?
విదేశీ మారక నిల్వలు ఒక దేశం సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న నగదు, ఇతర ఆస్తులు. విదేశీ మారక నిల్వలు బాండ్లు, నోట్లు, డిపాజిట్లు, ట్రెజరీ బిల్లులు, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉంటాయి. కొన్ని దేశాలు తమ నిల్వలలో కొంత భాగాన్ని బంగారంలో కలిగి ఉంటాయి. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులను కూడా రిజర్వ్ ఆస్తులుగా పరిగణిస్తారు.

మూడు నెలల గరిష్టానికి రూపాయి
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం మూడు నెలల గరిష్టానికి చేరింది. శుక్రవారం రూపాయి మారకం విలువ 75 దిగువకు చేరింది. డాలర్‌పై రూపాయి 42 పైసలు పెరిగి 74.59కు చేరింది. మార్చి 27 నంచి ఈ స్థాయికి రావడం ఇదే.

India foreign exchange reserves 5th largest in world

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విదేశీ మారక నిల్వల్లో భారత్‌కు ఐదో స్థానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: