జెఇఇ, నీట్ మళ్లీ వాయిదా

  సెప్టెంబర్ 1 నుంచి 6వరకు జెఇఇ మెయిన్, 27న అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష, దరఖాస్తుల్లో సవరణకు అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడికల కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో జరిగే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ), జెఇఇ అడ్వాన్స్‌డ్, నీట్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జెఇఇ మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలను సెప్టెంబర్ 27వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ […] The post జెఇఇ, నీట్ మళ్లీ వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సెప్టెంబర్ 1 నుంచి 6వరకు జెఇఇ మెయిన్, 27న అడ్వాన్స్‌డ్
సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష, దరఖాస్తుల్లో సవరణకు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడికల కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో జరిగే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ), జెఇఇ అడ్వాన్స్‌డ్, నీట్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జెఇఇ మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలను సెప్టెంబర్ 27వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. అలాగే దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలను నిర్వహించే నీట్ పరీక్షను సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. విద్యార్థుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని జెఇఇ, నీట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఇదివరకు ఖారారైన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా జెఇఇ మెయిన్ ఈ నెల 18 నుంచి 23 వరకు, జెఇఇ అడ్వాన్స్‌డ్ ఆగస్టు 23న, ఈ నెల 26న నీట్ పరీక్షలు జరగాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలను రెండవ సారి వాయిదా వేశారు. జెఇఇ, నీట్ పరీక్షలు రద్దు చేయాల్సిందిగా పలు రాష్ట్రాల తల్లిదండ్రులు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి జెఇఇ, నీట్ పరీక్షల నిర్వహణకు సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాల్సిందిగా గురువారం హెచ్‌ఆర్‌డి మంత్రి నిపుణుల కమిటీని నియమించారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత,పలు రాష్ట్రాలలో లాక్‌డౌన్ కొనసాగింపు నేపథ్యంలో జెఇఇ, నీట్ పరీక్షలను వాయిదా వేశారు.

నీట్ దరఖాస్తుల్లో సవరణకు అవకాశం
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-2020(నీట్) ఆన్‌లైన్ దరఖాస్తుల్లో పొరపాట్లు, పరీక్షా కేంద్రాల ఎంపిక మార్పునకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ మరోసారి అవకావం కల్పించింది.శనివార(జూలై 4) నుంచి ఈ నెల 15 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వినీత్ జోషి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణకు చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చని, అలాగే రాత్రి 11.50 గంటలకు వరకు ఫీజు చెల్లించవచ్చని అన్నారు. నీట్ పరీక్షకు 15 రోజుల ముందుగా వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు. నీట్ పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803 ఫోన్ నెంబర్లలో లేదా neet@nta.ac.inకు మెయిల్ చేయాలని తెలిపారు.

JEE and NEET exams postponed to September

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post జెఇఇ, నీట్ మళ్లీ వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: