రాష్ట్రంలో కరోనా విజృంభణ

  ఒకే రోజు 1892 నమోదు జిహెచ్‌ఎంసిలో 1658, జిల్లాల్లో 224 మందికి వైరస్ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కోవిడ్ వైరస్ దాడిలో మరో 8 మంది మృతి రాష్ట్రంలో లక్ష దాటిన టెస్టులు ఆలేరు ఎంఎల్‌ఎ సునీతకు వైరస్, 20వేలు దాటిన పాజిటివ్‌ల సంఖ్య 7 జిల్లాల్లో ట్రూనాట్ కిట్లతో టెస్టులు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేలు దాటాయి. ఒకే రోజు 1892 మందికి వైరస్ సోకగా, వైరస్ […] The post రాష్ట్రంలో కరోనా విజృంభణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒకే రోజు 1892 నమోదు
జిహెచ్‌ఎంసిలో 1658, జిల్లాల్లో 224 మందికి వైరస్
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కోవిడ్
వైరస్ దాడిలో మరో 8 మంది మృతి
రాష్ట్రంలో లక్ష దాటిన టెస్టులు
ఆలేరు ఎంఎల్‌ఎ సునీతకు వైరస్,
20వేలు దాటిన పాజిటివ్‌ల సంఖ్య
7 జిల్లాల్లో ట్రూనాట్ కిట్లతో టెస్టులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేలు దాటాయి. ఒకే రోజు 1892 మందికి వైరస్ సోకగా, వైరస్ దాడిలో మరో ఎనిమిది మంది మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1658, జిల్లాల్లో 224 మంది ఉన్నారు. అయితే రోజురోజుకి కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు నమోదైన కేసులే 24 గంటల్లో నమోదైన వాటిలో అత్యధిక కేసులు కావడం గమనార్హం. కొత్తగా వచ్చిన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 1658, రంగారెడ్డి 56, మేడ్చల్ 44,సంగారెడ్డి 20, కరీంనగర్ 1. మహబూబ్‌నగర్ 12, గద్వాల 1, రాజాన్న సిరిసిల్లా 6, ఖమ్మం 2, కామారెడ్డి 6, నల్గొండ 13, సిద్దిపేట్ 3, ములుగు 1, వరంగల్ రూరల్ 41, జగిత్యాల 1, మహబూబాబాద్ 7, నిర్మల్ 2, మెదక్ 3, నిజామాబాద్ 3, వరంగల్ అర్బన్ 1, భద్రాద్రి 4, నాగర్ కర్నూల్ 1, వికారాబాద్ 1, వనపర్తి లో ఐదుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 20462కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 10195,కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 9984 మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 283కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా…ఆలేరు నియోజకవర్గం ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకింది. దీంతో ఆమె యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం భాగానే ఉందని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. అయితే తన భర్త నివేదికలు ఇంకా రాలేదని తెలిపారు.

ఓ ప్రైవేట్ ల్యాబ్‌పై ప్రభుత్వం సీరియస్
రాష్ట్రంలో కరోనా టెస్టులు చేస్తున్న ఓ ప్రైవేట్ ల్యాబ్‌పై ప్రభుత్వం సీరియస్ అయింది. 3726 శాంపిల్స్‌లో 2672 మందికి సదరు ల్యాబ్ పాజిటివ్ ఇచ్చింది. అంటే 71.7 శాతం మందిని పాజిటివ్ రేట్‌గా చూపిందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. వెంటనే ఆ ల్యాబ్‌ను పరిశీలించాలని ప్రభుత్వం నిపుణుల కమిటీని సూచించింది. అయితే ఎక్కువ కేసులు రిపోర్టు చేసిన ఆ ల్యాబ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. నిపుణులు పరిశీలన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని వైద్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఆ ల్యాబ్ పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు.

రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా టెస్టులు
తెలంగాణలో కరోనా టెస్టులు లక్ష దాటాయి. మార్చి 1 నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో 1,04,118 మందికి టెస్టులు చేయగా, 20462 మందికి పాజిటివ్ తేలింది. రాబోయే రోజుల్లో టెస్టులు సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 789 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 38,898 శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,71,611 పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ సోకింది.

7 జిల్లాల్లో ట్రూనాట్ మిషన్లతో టెస్టింగ్‌లు
జిల్లాల్లో సిబినాట్, ట్రూనాట్ మిషన్లతో కరోనా శాంపిల్స్ నిర్ధారణ చేయాలని ప్రజారోగ్య, కుటుంబ సంచాలకులు డా గడల శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. టిబి వ్యాధి నిర్ధారణకు వినియోగించే ఈ యంత్రాల్లో కోవిడ్ శాంపిల్స్‌ను కూడా టెస్టు చేయొచ్చని జిల్లా అధికారులకు అదేశించారు. ఏడు సెంటర్ల ద్వారా ఆయా ప్రాంతాలను అనుసంధానం చేస్తూ శాంపిల్స్‌కు టెస్టులు చేయాలని పేర్కొన్నారు. ఈ యంత్రాల ద్వారా రోజులు 80 నుంచి 120 శాంపిల్స్‌ను పరీక్షించవచ్చని, కేవలం గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు.

 

COVID cases reach record high of 1,892

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రాష్ట్రంలో కరోనా విజృంభణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: