విస్తరణ వాద శకం ముగిసింది

  లడఖ్ పర్యటనలో చైనాకు ప్రధాని చురకలు శత్రువులకు మీ పరాక్రమాన్ని చాటారు దేశంలో ప్రతి ఇంట్లో మీ సాహస గాథలే చెప్పుకొంటున్నారు మన సైనిక శక్తి సమున్నతమైనది మీ త్యాగాలను దేశం మరువజాలదు జవాన్లకు మోడీ ప్రశంసలు సైనిక ఉన్నతాధికారులతో సరిహద్దు పరిస్థితిపై సమీక్ష ఆస్పత్రిలో గాయపడిన జవాన్లకు పరామర్శ లడఖ్: ప్రపంచంలో విస్తరణ వాద శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇంతకాలం విస్తరణ కాంక్షతో ప్రయత్నించిన శక్తులు ఓటమిని చవి […] The post విస్తరణ వాద శకం ముగిసింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లడఖ్ పర్యటనలో చైనాకు ప్రధాని చురకలు
శత్రువులకు మీ పరాక్రమాన్ని చాటారు
దేశంలో ప్రతి ఇంట్లో మీ సాహస గాథలే చెప్పుకొంటున్నారు
మన సైనిక శక్తి సమున్నతమైనది
మీ త్యాగాలను దేశం మరువజాలదు
జవాన్లకు మోడీ ప్రశంసలు
సైనిక ఉన్నతాధికారులతో సరిహద్దు పరిస్థితిపై సమీక్ష
ఆస్పత్రిలో గాయపడిన జవాన్లకు పరామర్శ

లడఖ్: ప్రపంచంలో విస్తరణ వాద శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇంతకాలం విస్తరణ కాంక్షతో ప్రయత్నించిన శక్తులు ఓటమిని చవి చూడడమో లేక తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడమో జరిగిన విషయాన్ని చరిత్ర సాక్షాత్కరిస్తోందన్నారు. ఇది విస్తరణ సమయం కాదని, అభివృద్ధే ధ్యేయంగా పని చేయాల్సిన సమయమని పరోక్షంగా చైనాకు చురకలంటించారు. వాస్తవాధీన రేఖ వెంబడి దురాక్రమణలకు పాల్పడుతూ సరిహద్దు వివాదాలను సృష్టిస్తున్న చైనాకు ఈ వ్యాఖ్యల ద్వారా ప్రధాని దీటైన సందేశాన్ని పంపించారు. సరిహద్దుల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించడం కోసం శుక్రవారం లడఖ్ ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించిన ప్రధాని మోడీ అక్కడి సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ‘ ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థాలేమిటో మీరు నిరూపించారు.

లడఖ్‌నుంచి కార్గిల్ దాకా మీ ధైర్యం అమోఘం. శత్రువులకు మీ పరాక్రమమేమిటో చూపించారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఇంట్లో భారత సైనికుల సాహసగాథల గురించి మాట్లాడుకుంటున్నారు’ అని ప్రధాని మోడీ సైనికులను కొనియాడారు. అంతేకాకుండా ఈ భూమి వీర భూమి. వీరులను కన్న భూమి. వేల సంవత్సరాలనుంచి ఎన్నో దాడులను తిప్పి కొట్టిన మన సంకల్పం ఎంతో గొప్పది. ప్రస్తుతం భారత శక్తి సామర్థాలు అజేయం. జల, వాయు, పదాతి, అంతరిక్ష విభాగాల్లో మన శక్తి సమున్నతమైనదని ఆయన అన్నారు. ధైర్య సాహసాలతోనే శాంతి లభిస్తుందని, బలహీనులు ఎప్పటికీ శాంతిని సాధించలేరని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అనేక సంక్షోభ సమయాల్లో భారత్ ప్రపంచం వెంట నడిచిందన్నారు. మీ చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని, మీ త్యాగాలను దేశం మరువదని జవాన్లను ప్రశంసించారు.

సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం నిశ్చింతగా ఉందని అన్నారు. మన సైనికులను చూసి తాను గర్వపడుతున్నాని అన్నారు. ‘మనం వేణువును ఊదే కృష్ణుడ్ని ప్రేమిస్తాం.. అలాగే సుదర్శన చక్రంతో పోరాడే కృష్ణుడిననీ ఆరాధిస్తాం’అని అన్నారు. జూన్ 15 వ తేదీ రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో దాదాపు 43 మంది చైనా సైనికులు కూడా చనిపోయినట్లు సమాచారం. ఈ ఘర్షణ అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్ష జరపడంతో పాటుగా జవాన్లలో స్థైర్యం నింపేందుకు ప్రధాని మోడీ శుక్రవారం లడఖ్‌లో పర్యటించారు.

గాయపడిన జవాన్లకు పరామర్శ
ప్రధాని లడఖ్‌లో అడుగుపెట్టే వరకు ఆయన పర్యటన గురించి మూడో కంటికి తెలియదు. ప్రధాని లడఖ్‌లో పర్యటించాలని గురువారం రాత్రి పొద్దుపోయాక తీసుకున్నట్లు తెలుస్తోంది. లడఖ్ చేరుకున్న వెంటనే నిములోని ఆర్మీ 14 కార్ప్ ప్రధాన కార్యాలయంలో అక్కడి పరిస్థితులపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణెలతో కలిసి సమీక్షించారు. భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో పాల్గొన్న ఆర్మీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైనారు. గల్వాన్ ఘటనపై స్థానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జవాన్లనుద్దేశించి దాదాపు 26 నిమిషాల సేపు ప్రసంగించారు. అంతకు ముందు ప్రధాని గల్వాన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన జవాన్లను లేహ్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో పరామర్శించారు. మీరు శత్రువులకు సరయిన జవాబు ఇచ్చారని వారిని ప్రశంసించారు.సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే ప్రధాని లడఖ్‌లో పర్యటించడం భారత సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించింది.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విస్తరణ వాద శకం ముగిసింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: