ఒక్క రోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు

  18 వేలు దాటిన మరణాలు 60 శాతం దాటిన రికవరీ రేటు తమిళనాడులో లక్షకు చేరువలో కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ దాదాపు 19 వేల పాజిటివ్ కేసులు బయటపడుతుండగా తాజాగా శుక్రవారం ఈ సంఖ్య 20 వేలు దాటి పోయింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ బయట పడిన తర్వాత […] The post ఒక్క రోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

18 వేలు దాటిన మరణాలు
60 శాతం దాటిన రికవరీ రేటు
తమిళనాడులో లక్షకు చేరువలో కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ దాదాపు 19 వేల పాజిటివ్ కేసులు బయటపడుతుండగా తాజాగా శుక్రవారం ఈ సంఖ్య 20 వేలు దాటి పోయింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ బయట పడిన తర్వాత ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలి సారి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,544కు చేరుకుంది. అంతేకాకుండా గురువారం ఒక్క రోజే 379 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 18,213కు చేరుకుంది.

అయితే గత కొన్ని రోజులుగా నమోదవుతున్న మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువ కావడం గమనార్హం. కాగా కరోనా సోకిన మొత్తం బాధితుల్ల్లో ఇప్పటివరకు 3,79,891 మంది కోలుకోగా మరో 2,27,439 మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కాగా గురువారం ఒక్క రోజే 20 వేల మందికి పైగా డిశ్చార్జి కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా బాధితుల్లో 60.73 శాతం మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని ఆ అధికారి చెప్పారు. కాగా జూన్ 1నుంచి ఇప్పటివరకు దేశంలో కరోనా కేసులు 4,35,009 మేర పెరిగాయి. కాగా ఈ నెల 2 వరకు దేశంలో మొత్తం 92,97,749 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి( ఐసిఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్క రోజే 2,41,576 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆ సంస్థ తెలిపింది.

కాగా దేశంలో కరోనా బాధితులతో పాటుగా మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. గడచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 3 వేల మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్ మరణాల రేటు 2.6 శాతంగా ఉంది. అయితే గత నెలతో పోలిస్తే మరణాల రేటు కాస్త తగ్గుతూ ఉండడం గమనార్హం. ఇక దేశంలో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 45 శాతం ఒక్క మహారాష్ట్రలోనే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 8,178కి చేరకుంది. గడచిన 24 గంటల్లో అక్కడ 125 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కేసుల సంఖ్య లక్షా 80 వేలు దాటింది. అయితే లక్షమందికి పైగా కోలుకుని డిశార్జి కావడం ఊరటనిస్తోంది.

మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. రాష్ట్రంలో గురువారం ఒక్క రోజే 4343 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు లక్షకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 98,392 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 1,231 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 92,175 పాజిటివ్ కేసులుండగా వీరిలో2,864 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్‌లోను కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 33,913కు చేరుకోగా, వీరిలో ఇప్పటివరకు 1886 మంది చనిపోయారు.

India records 20,903 COVID-19 Cases In Single day

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఒక్క రోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: