ఆగస్టు 15 నాటికల్లా కరోనా వ్యాక్సిన్!

  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘ కోవాక్సిన్’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్టు 15 నాటికి టీకాను మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధనా మండలి ( ఐసిఎంఆర్) భావిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఐసిఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ రాసిన ఓ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న […] The post ఆగస్టు 15 నాటికల్లా కరోనా వ్యాక్సిన్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘ కోవాక్సిన్’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్టు 15 నాటికి టీకాను మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధనా మండలి ( ఐసిఎంఆర్) భావిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఐసిఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ రాసిన ఓ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్షంతో క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతంగా జరిపేందుకు డిసిజిఐ అనుమతిని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే లక్షాన్ని చేరుకోవడంలో క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన 12 సంస్థల సహకారం అత్యంత కీలకమని డాక్టర్ బలరాం భార్గవ ఆ లేఖలో పేర్కొన్నారు. జూలై తొలి వారంలోనే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులన్నీ వీలయినంత వేగంగా పొందాలని కోరారు. ఈ మేరకు భార్గవ ఎంపిక చేసిన సంస్థలకు రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐసిఎంఆర్‌లోని విశ్వసనీయ వర్గాలు సైతం ఈ లేఖను ధ్రువీకరించాయి. అయితే అది అంతర్గత సమాచారం కోసం మాత్రమే రాసిందని తెలిపాయి. కాగా భారత్ బయోటెక్ మాత్రం దీనిపై స్పందించలేదు.

‘కోవాక్సిన్’ టీకా మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం భారత ఔషధ నియంత్రణ మండలి (డిసిజిఐ) ఇటీవలే అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను ఐసిఎంఆర్, పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) సహకారంతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సార్స్ కోవ్2 వైరస్ స్టెయిన్‌ను ఎన్‌ఐవి .. భారత్ బయోటెక్‌కు బదిలీ చేసింది. తదనంతరం హైదరాబాద్ సమీపంలోని భారత్ బయోటెక్‌కు చెందిన బయో సేఫ్టీ లెవల్3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు.

India corona vaccine may be launched by August 15

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆగస్టు 15 నాటికల్లా కరోనా వ్యాక్సిన్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: