సైనికులలో నైతిక స్థైర్యం నింపిన మోడీ

  న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ సందర్శనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ధీరోదాత్తులైన మన సైనికులలో నైతిక స్థైర్యాన్ని ఈ పర్యటన పెంపొందిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అమిత్ షా లడఖ్‌లోని సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న నిమూ పర్వత శ్రేణుల వద్ద సైన్యం, ఎయిర్ ఫోర్స్, ఐటిబిపి బలగాలను కలుసుకున్న ప్రధాని మోడీ ఫోటోలను షేర్ చేశారు. వాస్తవాధీన రేఖ […] The post సైనికులలో నైతిక స్థైర్యం నింపిన మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ సందర్శనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ధీరోదాత్తులైన మన సైనికులలో నైతిక స్థైర్యాన్ని ఈ పర్యటన పెంపొందిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అమిత్ షా లడఖ్‌లోని సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న నిమూ పర్వత శ్రేణుల వద్ద సైన్యం, ఎయిర్ ఫోర్స్, ఐటిబిపి బలగాలను కలుసుకున్న ప్రధాని మోడీ ఫోటోలను షేర్ చేశారు.

వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ప్రధాని మోడీ లడఖ్‌ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శంచారు. తూర్పు లడఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో గత నెల రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య జరిగిన ఘర్షణలలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన దరిమిలా ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తత తీవ్రతరమైంది.

PM visit Ladakh to boost morale of valorous soldiers

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సైనికులలో నైతిక స్థైర్యం నింపిన మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: