నేపాల్ ప్రధాని శర్మ భవితవ్యం

  ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కెపి శర్మ రాజకీయ భవిష్యతు ఏమిటనేది శనివారం వెల్లడి కానుంది. శనివారం అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కీలకమైన స్థాయి సంఘం సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని శుక్రవారం పార్టీ వర్గాలు తెలియచేశాయి. ఓలి రాజీనామాకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తోంది. గురువారమే ఈ కమిటీ భేటీ జరగాల్సి ఉంది. అయితే దీనిని వాయిదా వేశారు. పార్టీ అధినాయకత్వం ప్రధాని రాజీనామా వ్యవహారంపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో, పూర్తి స్థాయిలో దీనిపై […] The post నేపాల్ ప్రధాని శర్మ భవితవ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖాట్మండూ: నేపాల్ ప్రధాని కెపి శర్మ రాజకీయ భవిష్యతు ఏమిటనేది శనివారం వెల్లడి కానుంది. శనివారం అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కీలకమైన స్థాయి సంఘం సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని శుక్రవారం పార్టీ వర్గాలు తెలియచేశాయి. ఓలి రాజీనామాకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తోంది. గురువారమే ఈ కమిటీ భేటీ జరగాల్సి ఉంది. అయితే దీనిని వాయిదా వేశారు. పార్టీ అధినాయకత్వం ప్రధాని రాజీనామా వ్యవహారంపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో, పూర్తి స్థాయిలో దీనిపై శనివారం చర్చ జరగనుంది.

ఆయన ఇటీవల భారత వ్యతిరేక వ్యాఖ్యలకు దిగడం రాజకీయంగా కానీ దౌత్యపరంగా కానీ సముచితం కాదని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పుష్ప కమాల్ దహాల్ ప్రచండ తెలిపారు. గత వారంలో ప్రధాని ఓలి భారత దౌత్యవర్గాలపై తీవ్రస్థాయి ఆరోపణలకు దిగారు. ఎంబస్సీలు, హోటల్స్‌లలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని, పదవీచ్యుతుడిని చేసేందుకు కొన్ని వర్గాలు పావులు కదుపుతున్నాయని విమర్శిస్తూ భారతదేశాన్ని నిందించారు.

PM KP Sharma Oli govt facing uncertain future

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నేపాల్ ప్రధాని శర్మ భవితవ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: