చైనా, పాకిస్థాన్ నుంచి విద్యుత్ పరికరాలు దిగుమతి చేయొద్దు

  న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్ నుంచి ఎలాంటి విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకోవద్దని రాష్ట్రాలను కేంద్ర విద్యుత్‌శాఖమంత్రి ఆర్‌కె సింగ్ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రాల విద్యుత్‌శాఖ మంత్రులతో ఆర్‌కె సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఇక నుంచి ఆ రెండు దేశాల నుంచి ఎలాంటి దిగుమతులకూ ఆర్డర్ ఇవ్వొద్దని ఆర్‌కె సింగ్ స్పష్టం చేశారు. చైనా, పాకిస్థాన్‌లు సరిహద్దుల్లో మనకు సమస్యలు సృష్టిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ దేశాల నుంచి […] The post చైనా, పాకిస్థాన్ నుంచి విద్యుత్ పరికరాలు దిగుమతి చేయొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్ నుంచి ఎలాంటి విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకోవద్దని రాష్ట్రాలను కేంద్ర విద్యుత్‌శాఖమంత్రి ఆర్‌కె సింగ్ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రాల విద్యుత్‌శాఖ మంత్రులతో ఆర్‌కె సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఇక నుంచి ఆ రెండు దేశాల నుంచి ఎలాంటి దిగుమతులకూ ఆర్డర్ ఇవ్వొద్దని ఆర్‌కె సింగ్ స్పష్టం చేశారు. చైనా, పాకిస్థాన్‌లు సరిహద్దుల్లో మనకు సమస్యలు సృష్టిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో నాణ్యతా లోపాలు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు.

గత ఏడాది రూ.71,000 కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు దిగుమతి చేసుకోగా, వాటిలో రూ. 21,000 కోట్ల విలువైనవి చైనా నుంచి అని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మనకు అవసరమైన విద్యుత్ పరికరాలను దేశీయంగానే తయారు చేసుకోగల సామర్థం కలిగి ఉన్నామని ఆయన తెలిపారు. ఇక నుంచి విద్యుత్ పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారడాల్సిన అవసరం లేదని సింగ్ భరోసా ఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.93,000 కోట్ల రుణాల్ని రాష్ట్రాలు కోరగా, ఇప్పటి వరకు రూ.20,000 కోట్లు మంజూరు చేసినట్టు ఆర్‌కె సింగ్ తెలిపారు.

Ban on power equipment imports from China, Pakistan

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post చైనా, పాకిస్థాన్ నుంచి విద్యుత్ పరికరాలు దిగుమతి చేయొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: