ఎస్‌ఆర్‌ఎస్‌పికి కాళేశ్వరం కళ

  నంది పంప్‌హౌజ్ ద్వారా వరద కాల్వలోకి నీటి విడుదల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తితో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఒక టిఎంసి నీటి విడుదలకు ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్: వానాకాలం సాగు దృష్టా ఎస్సారెస్సీ వరద కాలువను నింపాలని గురువారం సిఎం కెసిఆర్‌ను కలిసి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వరద కాలువను కాళేశ్వరం నీటితో నింపాలని ఇరిగేషన్ అధికారి, కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్‌ను ముఖ్యమంత్రి […] The post ఎస్‌ఆర్‌ఎస్‌పికి కాళేశ్వరం కళ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నంది పంప్‌హౌజ్ ద్వారా వరద కాల్వలోకి నీటి విడుదల
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తితో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఒక టిఎంసి నీటి విడుదలకు ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: వానాకాలం సాగు దృష్టా ఎస్సారెస్సీ వరద కాలువను నింపాలని గురువారం సిఎం కెసిఆర్‌ను కలిసి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వరద కాలువను కాళేశ్వరం నీటితో నింపాలని ఇరిగేషన్ అధికారి, కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు సుమారు 100 కి.మీల మేర ఉన్న ఎస్సారెస్సీ వరద కాలువను కాళేశ్వరం నీటితో నింపారు. వరద కాలువలోకి 1 టిఎంసి (3,150 క్యూసెక్కుల నీటిని) లింక్ నంది పంప్‌హౌస్ ద్వారా కరీంనగర్‌లో అధికారులు విడుదల చేశారు. రైతుల కోరిక మేరకు అడిగిన వెంటనే కాలువలోకి నీటిని నింపినందుకు మంత్రి వేముల సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ వరద కాలువలోని సాగునీటి ద్వారా పెద్ద ఎత్తున ఆయకట్టు రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక రైతుగా సాగుటి కష్టాలు, అవసరాలు తనకు తెలుసని, అందులో భాగంగానే సిఎంను కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతుల గోసను తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమం విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. రైతుల కష్టాలు తన కష్టాలుగా భావించి ఒక తండ్రి వల్లే ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారన్నారు. ఇది యావత్ తెలంగాణ రైతాంగానికి అదృష్టమన్నారు. రైతేరాజు అన్న నినాదాన్ని ఆచరణలో చూపెడుతున్న సిఎం కెసిఆర్ నిరంతరం రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తున్నారన్నారు. ఎస్సారెస్సీ వరదకాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులు అప్రమత్తం కావాలని, సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆయకట్టు రైతాంగం పక్షాన మంత్రి వేముల సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Release 1 tmc water to SRSP canal says CM KCR

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఎస్‌ఆర్‌ఎస్‌పికి కాళేశ్వరం కళ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: