తల్లి ఫేస్‌బుక్ స్నేహానికి కూతురు బలి

  ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధాలు ముగురి నడుమ విబేధాలు, అనూష కూతురు ఐదేళ్ల ఆద్యను సర్జికల్ కత్తితో గొంతుకోసి చంపి, రాజశేఖర్‌పై దాడి చేసిన కరుణాకర్ ఆపై ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలో చికిత్స ఫేస్‌బుక్ పరిచయమే ప్రాణాలు తీసింది మనతెలంగాణ/(మేడ్చల్)హైదరాబాద్: ఓ వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా తన కన్నబిడ్డ దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన […] The post తల్లి ఫేస్‌బుక్ స్నేహానికి కూతురు బలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధాలు
ముగురి నడుమ విబేధాలు, అనూష కూతురు ఐదేళ్ల ఆద్యను సర్జికల్ కత్తితో గొంతుకోసి చంపి, రాజశేఖర్‌పై దాడి చేసిన కరుణాకర్
ఆపై ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలో చికిత్స
ఫేస్‌బుక్ పరిచయమే ప్రాణాలు తీసింది

మనతెలంగాణ/(మేడ్చల్)హైదరాబాద్: ఓ వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా తన కన్నబిడ్డ దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన కల్యాణ్ రావు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూషతో 2011లో కల్యాణ్ రావుకు ప్రేమ వివాహం జరిగింది. దంపతులిద్దరూ రెండేళ్లుగా ఘట్ కేసర్ మండలం పోచారం పురపాలక సంఘం పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి ఐదేళ్ల ఆద్య అనే చిన్నారి ఉంది. చిన్నారి తల్లి అనూషకు 3 నెలల క్రితం ఫేస్‌బుక్‌లో కరుణాకర్ పరిచయమయ్యాడు.

వీరి మధ్య స్నేహం అక్రమ సంబంధంగా మారింది. ఈ క్రమంలో కరుణాకర్ ద్వారా అనూషకు రాజశేఖర్ పరిచయమయ్యాడు. తాన లేని సమయంలో ఇంటికి ఎవరో వస్తున్నారని తెలిసిన కల్యాణ్ రావు భార్యను మందలించాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా రాజశేఖర్ తో స్నేహంగా ఉంటున్న అనూష కరుణాకర్‌ను దూరం పెట్టింది. అయితే కరుణాకర్ ద్వారా పరిచమైన రాజశేఖర్‌తో తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని అనూష భర్తకు ఏమాత్రం తెలికుండా సాగించింది. కాగా అనూష మొదటి ప్రియుడు కరుణాకర్‌కు అనుమానం వచ్చింది. తన స్నేహితుడు రాజశేఖర్ అనూషను తరచూ కలుస్తున్నట్లు అనుమానంతో ఉన్న కరుణాకర్ అనూష ఇంటిపై నిఘా ఉంచాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రాజశేఖర్ అనూష ఇంటికి వచ్చాడు. రాజశేఖర్ ద్విచక్ర వాహనం, చెప్పులు, ఇంటి తలుపులు మూసి ఉండటం గమనించిన కరుణాకర్ తన అనుమానం నిజమైందనుకున్నాడు.

సర్జికల్ కత్తితో అనూష ఇంట్లోకి ప్రవేశించాడు. కరుణాకర్ వచ్చిన విషయాన్ని గమనించిన అనూష రాజశేఖర్ ను బాత్ రూంలో దాచింది. దీంతో గదిలో నుంచి బయటకు రావాలని రాజశేఖర్ ను కరుణాకర్ ఒత్తిడి చేశాడు. బయటకు రాకపోతే అనూష ఐదేళ్ల కూతురు ఆద్యను చంపుతానని బెదిరించాడు. రాజశేఖర్ బయటకు రాకపోయే సరికి కరుణాకర్ అన్నంత పని చేశాడు. తన వద్ద ఉన్న కత్తితో చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. చిన్నారి అరుపులతో రాజశేఖర్ బయటకు రాగా అతనిపైనా కత్తితో దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు రాజశేఖర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆపై తన రెండు చేతులు, గొంతు కోసుకుని కరుణాకర్ ఇంట్లో నుంచి బయటకు వస్తూ అనూష నిన్ను చాలా బాగా చూసుకున్నా నాకు ఎందుకు అన్యాయం చేశావంటూ గట్టిగా కేకలు వేశాడు.

చిన్నారి తీవ్ర గాయాలతో ఉండటం గమనించిన స్థానికులు ఆద్యను, అనూషను ఇసిఐఎల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ఆద్య చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. తీవ్రగాయాలతో ఉన్న కరుణాకర్ ను 108 వాహన సిబ్బంది ఉప్పల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మల్కాజ్ గిరి డిసిపి రక్షితమూర్తి, ఎసిపి నరసింహారెడ్డి, సిఐ రఘువీరారెడ్డి పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనూష ఫేస్‌బుక్ చాట్‌లోని వివరాలను సేకరించి రాజశేఖర్‌నూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లి అక్రమ సంబంధం అభంశుభం తెలియని చిన్నారిని ఓ కిరాతకుడు గొంతుకోసి దారుణంగా హత్యచేసిన ఘటన పలువురి కంటకన్నీరు పెట్టించింది.

Daughter killed by Mother Illicit relationship in Facebook

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post తల్లి ఫేస్‌బుక్ స్నేహానికి కూతురు బలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: