బొగ్గు బ్లాకుల ప్రైవేటుపై కదం తొక్కిన కార్మికులు

  కవిత పిలుపుతో సమ్మెలో పాల్గొన్న వేలాది కార్మికులు, గనుల ప్రైవేటీకరణ ఉపసంహరణకు డిమాండ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కిన కార్మికులు కవిత పిలుపుతో సమ్మెలో పాల్గొన్న వేలాది కార్మికులు బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించాలి కేంద్రాన్ని డిమాండ్ చేసిన కవిత మనతెలంగాణ/హైదరాబాద్: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. గురువారం ఉదయం షిప్ట్ నుంచి అన్ని గనుల్లో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతుంది. టిఆర్‌ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ సింగరేణి బొగ్గు గని కార్మిక […] The post బొగ్గు బ్లాకుల ప్రైవేటుపై కదం తొక్కిన కార్మికులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కవిత పిలుపుతో సమ్మెలో పాల్గొన్న వేలాది కార్మికులు, గనుల ప్రైవేటీకరణ ఉపసంహరణకు డిమాండ్
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కిన కార్మికులు
కవిత పిలుపుతో సమ్మెలో పాల్గొన్న వేలాది కార్మికులు
బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన కవిత

మనతెలంగాణ/హైదరాబాద్: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. గురువారం ఉదయం షిప్ట్ నుంచి అన్ని గనుల్లో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతుంది. టిఆర్‌ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికెఎస్) సమ్మెలో పాల్గొని కేంద్రానికి నిరసన తెలిపింది. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు వారికి అప్పగించేందుకు నిర్ణయించడంపట్ల టిబిజికెఎస్ మండిపడింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా తెలంగాణలో 24 గంటల సమ్మె కొనసాగుతుంది. సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న కొమురం భీం జిల్లా నుంచి భద్రాద్రి వరకు అన్ని భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. అనేక గనుల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

టిబిజికెఎస్‌తో పాటుగా మరికొన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. అయితే ముందు వరుసలో టిబిజికెఎస్ సమ్మెలో సంపూర్ణంగా పాల్గొన్ని బొగ్గుగనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. శ్రీరాంపూర్ 3 గని దగ్గర టిబిజికెఎస్ కార్మికులు పెద్దసంఖ్యలో సమ్మెలో దిగారు. జాతీయ కార్మిక సంఘాల వైఫల్యంతోనే కేంద్రం బొగ్గు గనుల ప్రైవేటీకరణకు పూనుకుందని ఈ సంఘం ఆరోపించింది. బిజెపి ప్రభుత్వానికి జాతీయ కార్మిక సంఘాలు లొంగిపోయాయని టిబిజికెఎస్ నిందించింది. కార్మికులకు నష్టం కలగవద్దనే ఒకరోజు సమ్మెకు టిఎస్‌బిజికెఎస్ పిలపునిచ్చిందని సంఘం నాయకులు చెప్పారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, పెద్దపల్లి, రామగుండం, గోదావరిగని, మందమర్రి బొగ్గుగని ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల జీవితాలతో కేంద్రప్రభుత్వం చలగాటమాడుతుందని టిఎస్ బిజికెఎస్ కార్మిక సంఘం ఆరోపించింది. కార్మికుల నిరసనకు స్పందించి కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్‌లో 1,2,3 రీజియన్లలో సుమార్ 18 వేల మంది కార్మికులు సమ్మెలో దిగడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచి పోయింది.

కవిత పిలుపుతో కదం తొక్కిన కార్మికులు
తెలంగాణ సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలపు మేరకు సింగరేణి కార్మికులు భారీ సంఖ్యలో కదం తొక్కారు. ఫలితంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టిజిబిఎస్‌కె 24 గంటల సమ్మె పిలుపుతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా టిబిజిఎస్‌కె డిమాండ్ చేసింది. బెల్లంపల్లి, మందమర్రి,మాదాపూర్, శ్రీరాంపూర్, రామగుండం డివిజన్లలో వేలాదిమంది కార్మికులు కవిత పిలుపుతో సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సమ్మెతో ఒక్కరోజులోనే 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కవిత పిలుపుతో సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి ఆందోళన్లలో పాల్గొన్నారు. భూగర్భగనులు, ఓపెన్‌కాస్ట్ గనులకు చెందిన అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వం తక్షణం బొగ్గుగనుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే 24 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. సహజవనరులపై దేశ ప్రజలకున్న హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి ఇరుసులా ఉన్న సింగరేణిని ప్రైవేటు పరం చేసి రాష్ట్రాభివృద్ధి అడ్డుకోవాలన్నదే బిజెపి కుట్రని పేరొన్నారు. కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన కార్మికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టిబిజికెఎస్ నేతృత్వంలో కొనసాగుతున్న సమ్మెపై మాజీ ఎంపి కవిత చేసిన ట్విట్టర్ ట్రేడింగ్‌లో టాప్‌లో నిలిచింది. వందల సంఖ్యలో రీట్విట్ అయింది. దేశంలోని పలువురు ప్రముఖులు, మేధావులు సమ్మెపై కవితతో ట్విట్టర్ వేదికగా చర్చించారు.

కవిత పిలుపుకు టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగాల మద్దతు
సింగరేణి సమ్మె పిలుపునిచ్చిన కల్వకుంట్ల కవితకు మద్దతుగా టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సంఘాలు నిలిచాయి. కవిత పిలుపుమేరకు సమ్మెలో పాల్గొన్న కార్మికులకు అండగా ఉంటామని ఎన్‌ఆర్‌ఐ యుకె కార్యదర్శి సత్యమూర్తి చిలుమల తెలిపారు. వేలాదిమంది కార్మికులు స్వచ్ఛందంగా, లక్షలాది మంది కార్మికులు పరోక్షంగా సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి ప్రైవేట్ పరమైతే బొగ్గు ధర పెరగడంతో పాటు విద్యుత్ ధర కూడా పెరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్న మాజీ ఎంపి కవిత డిమాండ్‌కు టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు సాసర్ల నాగేందర్ మద్దతు ప్రకటించారు. బిజెపి ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

TRS-affiliated union protests privatisation of coal

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బొగ్గు బ్లాకుల ప్రైవేటుపై కదం తొక్కిన కార్మికులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: