అదే చైనా నిజ స్వరూపం

  డ్రాగన్ విస్తరణ కాంక్షపై ట్రంప్ నిశిత వ్యాఖ్యలు వాషింగ్టన్: భారత్ సహా సరిహద్దు దేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అది చైనా నిజస్వరూపాన్ని బైటపెట్టిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ ఎనానీ వెల్లడించారు. గత కొద్ది వారాలుగా భారత్ ‌చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్‌లో చెలరేగిన ఘర్షణల్లో ఇరు దేశాలకు […] The post అదే చైనా నిజ స్వరూపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డ్రాగన్ విస్తరణ కాంక్షపై ట్రంప్ నిశిత వ్యాఖ్యలు

వాషింగ్టన్: భారత్ సహా సరిహద్దు దేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడింది. అది చైనా నిజస్వరూపాన్ని బైటపెట్టిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ ఎనానీ వెల్లడించారు. గత కొద్ది వారాలుగా భారత్ ‌చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్‌లో చెలరేగిన ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు మరణించడంతో అక్కడి పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపింపజేస్తున్నాయి. కాగా చైనా విస్తరణ కాంక్షను నిందిస్తూ అమెరికా భారత్‌కు మద్దతు తెలియజేసింది.

భారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యాలనుంచి ఎదురవుతున్న ముప్పును ప్రతిఘటించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను పంపించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘భారత్ చైనా సరిహద్దుల్లో చైనా దురాక్రమణ తీరు ఇతర ప్రాంతాల్లో ఆ దేశ దుందుడుకు చర్యకు సరిగ్గా సరిపోతుందని ట్రంప్ విమర్శించారు. ఈ చర్యలన్నీ చైనా కమ్యూనిస్టు పార్టీ నిజస్వరూపాన్ని నిర్ధారిస్తున్నాయని ఆయన అన్నారు అని మీడియా సమావేశంలో భాగంగా మెక్ ఎనానీ వ్యాఖ్యానించారు.

ఈ వివాదంపై అగ్రరాజ్యం ఇప్పటిదాకా కొనసాగిస్తున్న తటస్థ వైఖరిని కాస్త తీవ్రతరం చేసిందని భారత్, అమెరికా సంబంధాలను అధ్యయనం చేస్తున్న పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ‘భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. అధ్యక్షుడు ఈ అంశంపై దృష్టి సారించారు. బలగాలను ఉపసంహరించుకోవాలనే ఆకాంక్షను ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుత విభేదాలపై సామరస్య పూర్వక పరిష్కారానికి మేం మద్దతు తెలుపుతాం అని కేలీ ఈ సందర్భంగా వెల్లడించారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అదే చైనా నిజ స్వరూపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: