అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు

  కరోనా ప్రాణాంతకమేమీ కాదు అంతరించడం వైరస్ సహజ నైజం లాక్‌డౌన్‌తో పరిష్కారం అసాధ్యమే ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ సునేత్ర గుస్తా లండన్ : మనలో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సునేత్ర గుప్తా తెలిపారు. ఆమె అంటువ్యాధుల నిపుణులుగా ఉన్నారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో ప్రొఫెసర్ అయిన సునేత్ర గుస్తా కరోనావైరస్ ప్రాణాంతకమైన వ్యాధి ఏమీ కాదన్నారు. అందరినీ ఇది కబళిస్తుందని అనుకోవడానికి వీల్లేదని అన్నారు, ఓ ఫ్లూ వంటి వ్యాధి […] The post అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా ప్రాణాంతకమేమీ కాదు
అంతరించడం వైరస్ సహజ నైజం
లాక్‌డౌన్‌తో పరిష్కారం అసాధ్యమే
ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ సునేత్ర గుస్తా

లండన్ : మనలో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సునేత్ర గుప్తా తెలిపారు. ఆమె అంటువ్యాధుల నిపుణులుగా ఉన్నారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో ప్రొఫెసర్ అయిన సునేత్ర గుస్తా కరోనావైరస్ ప్రాణాంతకమైన వ్యాధి ఏమీ కాదన్నారు. అందరినీ ఇది కబళిస్తుందని అనుకోవడానికి వీల్లేదని అన్నారు, ఓ ఫ్లూ వంటి వ్యాధి గురించి ఎంతవరకూ భయపడుతామో అంతకు మించి భయాందోళనలు అవసరం లేదన్నారు. అయితే శారీరక బలహీనత అంశం కూడా పరిగణనలోకి వస్తుందన్నారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ అవసరం ఉందని, అయితే ఇప్పుడు సాగుతున్న లాక్‌డౌన్ దీర్ఘకాలిక పరిష్కారం కాబోదని ఆమె స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ వల్ల వైరస్ సంక్రమణం నిలిచిపోతుందని కానీ వ్యాప్తి చెందకుండా ఉంటుందని కానీ అనుకోవడానికి వీల్లేదన్నారు. లాక్‌డౌన్ అనేది అత్యంత కఠిన చర్య అని, దీనితో ఇతరత్రా సమస్యలు వస్తాయని చెపుతూ వస్తున్న సునేత్ర తమ వాదనను బలోపేతం చేస్తూ తాజాగా ప్రొఫెసర్ రీ ఓపెన్ పేరిట తమ ట్విట్టర్‌లో పలు అంశాలను ప్రస్తావించారు, వైరస్ అసహజ పరిస్థితుల్లో వస్తే అది అంతరించిపోవడం అనేది సహజ పరిణామాలతోనే జరుగుతుందని, ఈ దశలో మనుష్యులందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌లు వాడాల్సిన అవసరం లేదని తెలిపారు. మనలో చాలా మందికి ఔషధంతో పనిలేదని పేర్కొన్నారు. అంతరించిపోయే వైరస్‌గానే దీనిని భావించాల్సింటుందని ఆమె స్పష్ఠం చేశారు. ఇది ఎప్పటికి అంతం అవుతుందో తెలియదని అంతటా ప్రచారం సాగుతున్న దశలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మనలో సాధారణ లక్షణాలు ఉండే వారు, ఆరోగ్యవంతులు, యుక్త వయస్కులు, వృద్థులు బలహీనులు కాని వారు ఈ వైరస్‌తో భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమైనా లేదని అన్నారు. ఇప్పటికైతే పూర్తిస్థాయి వ్యాక్సిన్ రాలేదని అయితే ఇది వస్తే దీనిని ముందుగా అనారోగ్య పరిస్థితితో ఉన్న వారికోసం వినియోగించాల్సి ఉంటుందన్నారు. గతంలో సంభవించిన ఇన్‌ఫ్లూయెంజా దశ మరణాలతో పోలిస్తే కరోనా వైరస్ బాధితులు తక్కువగా ఉంటారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారీ అసాధ్యమేమీ కాదని, త్వరలోనే దీనిని సాధించుకోవచ్చునన్నారు. లాక్‌డౌన్‌ను తాను తప్పుపట్టడం లేదని అయితే దీనితోనే పూర్తిస్థాయిలో వైరస్‌ను అరికట్టవచ్చునని అనుకోవడానికి వీల్లేదన్నారు. లాక్‌డౌన్ అనర్థాలను కూడా సమీక్షించుకోవల్సి ఉంటుందని తెలిపారు.

వైరస్‌ను రెండు మూడు రకాల సమగ్ర పద్థతులతో అరికట్టవచ్చునని, ఇందులో లాక్‌డౌన్ ఒకటని ఇదే సమయంలో ఔషధేతర జోక్యాలు ఇతరత్రా ఉపశమనాలు ప్రజలకు అత్యవసరం అని విశ్లేషించారు. వైరస్‌తొలి దశ ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఉందని, రెండో దశ తీవ్రత ఉంటుందని అనుకోవడం లేదన్నారు. వైరస్ మన జీవితంలో ఓ భాగం అవుతుందని , గతంలో పలు వైరస్‌లు వచ్చి కాలక్రమంలో అంతరించిపొయ్యాయని, ఇదే విధంగా ఈ వైరస్ కూడా పోతుందని తెలిపారు. వైరస్‌కు అంతరించిపోవడం అనే సహజసిద్ధ లక్షణం ఉందని తెలిపారు. లాక్‌డౌన్ విచక్షణాయుత చర్యనే అవుతుందని, అయితే ఇతరత్రా ఉపశమన చర్యలు లేకుండా సుదీర్ఘంగా సాగితే ఇది వికటిస్తుందని హెచ్చరించారు. అయితే కొన్ని దేశాలలో విజయవంతంగా లాక్‌డౌన్‌ను అమలు చేశారని, ఆంక్షల సడలింపుల నేపథ్యంలో తిరిగి వైరస్ విజృంభించిన పరిణామాలను కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

అందరినీ కరోనా కాటేస్తుందనే భయాందోళనలు అనవసరం అని, ఆరోగ్యపరంగా బాగా ఉండే వ్యక్తులకు వ్యాక్సిన్‌ల అవసరం లేదన్నారు. సామాజిక పరిణామాలు ఇతరత్రా అంశాలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటూ లాక్‌డౌన్ అయినా ఇతరత్రా కట్టడి చర్యలను తీసుకోవల్సి ఉంటుందని, ఒక వైరస్‌ను అరికట్టే క్రమంలో ఇతరత్రా అనుబంధ సమస్యలు వచ్చిపడితే అది సామాజిక ప్రాపంచిక భౌగోళిక సమస్యగా సంక్షోభంగా తలెత్తుందని హెచ్చరించారు. ఎపిడమాలిజిస్టు అయిన సునేత్ర గుప్తా నవలారచయిత్రి కూడా. అంటువ్యాధులపై ఎన్నో పరిశోధనలు జరిపారు. ప్రత్యేకించి మలేరియాపై జరిపిన రిసెర్చ్ మన్ననలు పొందింది, హెచ్‌ఐవి, ఫ్లూ, బ్యాక్టీరియల్ వ్యాధులు గురించి పరిశోధనలు జరిపిన ఆమె సాహిత్యంలో పురస్కారాలు కూడా పొందారు. కలకత్తాలో జన్మించిన ఆమె ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో ప్రఖ్యాత ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తూ వస్తున్నారు.

 

Most of us won’t need Covid-19 vaccine

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: