రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలు

  12 సుఖోయ్, 21 మిగ్29 యుద్ధ విమానాలకు రక్షణ శాఖ పచ్చజెండా దేశీయంగా మరిన్ని అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు మొత్తం రూ.రూ.31,130 కోట్ల ఆయుధాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యం తన అస్త్రాలను మెరుగుపర్చుకోవాలనుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా రష్యానుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ పచ్చ జెండా ఊపింది. యుద్ధ విమానాల్లో సుఖోయ్ ఎస్‌యు30 ఎంకెఐ ఫైటర్లు 12, […] The post రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

12 సుఖోయ్, 21 మిగ్29 యుద్ధ విమానాలకు రక్షణ శాఖ పచ్చజెండా
దేశీయంగా మరిన్ని అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు
మొత్తం రూ.రూ.31,130 కోట్ల ఆయుధాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యం తన అస్త్రాలను మెరుగుపర్చుకోవాలనుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా రష్యానుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ పచ్చ జెండా ఊపింది. యుద్ధ విమానాల్లో సుఖోయ్ ఎస్‌యు30 ఎంకెఐ ఫైటర్లు 12, మిగ్29 యుద్ధ విమానాలు 21 ఉన్నాయి. వీటితో పాటుగా ఇప్పడున్న మరో 59 మిగ్29 యుద్ధ విమానాల ఆధునీకరణకు కూడా అనుమతి ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ శాఖ సమీకరణ మండలి ఆమోదం తెలిపినట్లు రక్షణ శాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రాజెక్టు మొత్త విలువ రూ.18,148 కోట్లుగా ఉంటుందని కూడా ఆ ప్రకటన స్పష్టం చేసింది. మిగ్ యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ ప్రాజెక్టు విలువ రూ.7,418 కోట్లు కాగా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్‌ఎఎల్) నుంచి సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలు విలు రూ.10,730 కోట్లుగా ఉంటుంది. భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ యుద్ధ విమానాలను రష్యా హెచ్‌ఎఎల్‌లో తయారు చేస్తోంది. వీటితో పాటుగా గగగనతలంనుంచి గగన తల లక్షాలను ఛేదించగల బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను వాయుసేన, నౌకాదళాల కోసం సేకరిస్తోంది. అంతేకాకుండా వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్షాలను ఛేదించే పినాక క్షిపణుల తయారీకి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ( డిఆర్‌డిఓ)కు పచ్చ జెండా ఊపింది.

ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంలో భాగంగా మొత్తంగా దేశీయ రక్షణ సంస్థలకు సంబంధించిన రూ.38,900 కోట్లలో రూ.31,130 కోట్లకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని ఆ ప్రకటన తెలిపింది. ఈ ఆయుధాల కొనుగోలుతో మన నౌకాదళం, వాయుసేన సామర్థం మరింతగా పెరుగుతుందని కూడా ఆ ప్రకటన స్పష్టం చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఈ ఆయుధాల కొనుగోలుతో మన సాయుధ బలగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని డిఆర్‌డిఓ చైర్మన్, రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి జి సతీష్ రెడ్డి పేర్కొన్నారు.

India approves purchase of 33 Russian fighter jets

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: