6 లక్షలు దాటిన కరోనా కేసులు

  ఒక్క రోజే 19,148 కేసులు, 434 మరణాలు 18 రోజుల్లోనే రెట్టింపు అయిన పాజిటివ్ కేసులు 90 లక్షలు దాటిన కోవిడ్ 19 పరీక్షలు 60 శాతానికి రికవరీలు పెరుగుదల మహారాష్ట్రలో ఆగని మహమ్మారి ఉధృతి ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వైరస్ తీవ్రత న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ 19 వేలకు పైగా పాజిటివ్ కేసులు బైటపడుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో […] The post 6 లక్షలు దాటిన కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒక్క రోజే 19,148 కేసులు, 434 మరణాలు
18 రోజుల్లోనే రెట్టింపు అయిన పాజిటివ్ కేసులు
90 లక్షలు దాటిన కోవిడ్ 19 పరీక్షలు
60 శాతానికి రికవరీలు పెరుగుదల
మహారాష్ట్రలో ఆగని మహమ్మారి ఉధృతి
ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వైరస్ తీవ్రత

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ 19 వేలకు పైగా పాజిటివ్ కేసులు బైటపడుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19,148 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,04,641కి చేరుకున్నాయి. బుధవారం ఒక్క రోజే 434 మంది వైరస్‌తో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 17,834కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక దేశంలో కరోనా బారిన పడిన వారిలో ఇప్పటివరకు 3,59,859 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లగా, 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్యతో కేవలం 18 రోజుల్లోనే బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. జూన్ 13వ తేదీన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,08,993గా ఉండగా జూలై 2వ తేదీ నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఇక మరణాల సంఖ్య కూడా దాదాపు అదే స్థాయిలో పెరుగుతోంది. జూన్ 13 నాటికి 8,884 మరణాలు సంభవించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 17,834కు చేరుకుంది. అయితే దేశంలో వైరస్ బారిన పడడి కోలుకొంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం ఊరట కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం కోవిడ్ కేసుల రికవరీ రేటు దాదాపు 60 శాతంగా ఉంది. మరణాల రేటు 2.6 శాతంగా ఉంది. గత నెలతో పోలిస్తే మరణాల రేటు కూడా తగ్గుతుండడం గమనార్హం.

మహారాష్ట్రలో 8 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో కోవిడ్ మహమ్మారి రోజురోజుకు వికృత రూపం దాలుస్తోంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 8,000 దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో దాదాపు 45 శాతం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. బుధవారం కూడా రాష్ట్రంలో తాజాగా మరో 198 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 8,053కు చేరుకుంది. కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,80,298కి చేరుకుంది. ఇక మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో వైరస్ తీవ్రత అధికంగా ఉంది.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 94,049కి చేరుకోగా, మరణాల సంఖ్య 1,264కు చేరుకుంది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా వైరస్ ఉధృతి అదుపులోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 89,802 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే 60 వేల మంది కోలుకున్నారు. గుజరాత్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,232 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,867 మంది వైరస్ వారణంగా మృత్యువాత పడ్డారు.

90 లక్షలు దాటిన టెస్టులు
ఇదిలా ఉండగా దేశంలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 90లక్షలను దాటిపోయింది. జూలై 1వ తేదీ వరకు దేశంలో మొత్తం 90,56,173 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) తెలిపింది. దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు దేశంలో పుణెలో ఒకే ఒక వైరాలజీ లాబ్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,065కు చేరుకుంది. వీటిలో 768 ల్యాబ్‌లో ప్రభుత్వ రంగంలో ఉండగా, 297 ల్యాబ్‌లు ప్రైవేటు రంగంలో ఉన్నట్లు ఐసిఎంఆర్ తెలిపింది. దేశంలో శాంపిల్స్ పరీక్షల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోందని, బుధవారం ఒక్క రోజే 2,29,588 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు కూడా ఆ సంస్థ తెలిపింది. త్వరలోనే దేశంలో కరోనా పరీక్షలు జరిపిన వారి సంఖ్య కోటికి చేరుకుంటుందని కూడా ఐసిఎంఆర్ తెలిపింది.

India reports 19,148 new corona cases in 24 hours

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 6 లక్షలు దాటిన కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: