చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్

హైదరాబాద్ : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం నుంచి చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. నాలుగు నెలల పాటు ఆయన ఈ దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా ఆయన బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, భూతల శయనం, నదీ స్నానం వంటి నియమాలను పాటిస్తారు. ఇటీవలే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మూడు సినిమాలను లైన్లో పెట్టారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లకు ఆటంకం ఏర్పడింది. […] The post చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం నుంచి చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. నాలుగు నెలల పాటు ఆయన ఈ దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా ఆయన బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, భూతల శయనం, నదీ స్నానం వంటి నియమాలను పాటిస్తారు. ఇటీవలే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మూడు సినిమాలను లైన్లో పెట్టారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లకు ఆటంకం ఏర్పడింది. అయితే అన్ లాక్ తరువాత సినిమా షూటింగ్ లకు తెలంగాణ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. అయినప్పటికీ పవన్ మాత్రం నాలుగు నెలల పాటు దీక్ష పాటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశం లేకపోవడం, షూటింగ్ లు అంటే చాలా మందితో కూడుకున్నది కావడం వల్లనే ఈ నాలుగు నెలలు షూటింగ్ లకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పవన్ దీక్ష చేపట్టినట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సినిమా ’పింక్‘ కు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్‘ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో వచ్చే ’విరూపాక్ష‘ సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ’వకీల్ సాబ్‘ షూటింగ్ మాత్రం 20 శాతమే మిగిలి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించే మరో సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: