వాడుకున్నాడు…బెదిరిస్తున్నాడు…ఎస్ఐతో మహిళకు ప్రాణహాని

అమరావతి: పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితురాలుకు మాయమాటలు చెప్పి ఓ ఎస్‌ఐ లొంగదీసుకున్నాడని, సదరు పోలీస్‌తో తనకు ప్రాణహాని గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏడు సంవత్సరాల క్రితం భార్య భర్తల మధ్య వివాదం ఏర్పడడంతో ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎస్‌ఐ జగదీష్ జోక్యం చేసుకొని తన భర్త నుంచి విడాకులు ఇప్పించాడని పేర్కొంది. తన […] The post వాడుకున్నాడు… బెదిరిస్తున్నాడు… ఎస్ఐతో మహిళకు ప్రాణహాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితురాలుకు మాయమాటలు చెప్పి ఓ ఎస్‌ఐ లొంగదీసుకున్నాడని, సదరు పోలీస్‌తో తనకు ప్రాణహాని గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏడు సంవత్సరాల క్రితం భార్య భర్తల మధ్య వివాదం ఏర్పడడంతో ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎస్‌ఐ జగదీష్ జోక్యం చేసుకొని తన భర్త నుంచి విడాకులు ఇప్పించాడని పేర్కొంది. తన దగ్గర ఫోన్ నంబర్ తీసుకొని తన వివాహం చేసుకొని తనతో కాపురం చేస్తున్నాడని తెలిపింది. ఈ మధ్యలో తనకు దూరంగా ఉండడమే కాకుండా తనని వదిలించుకోవాలని అనుకుంటున్నాడని, తనపై వ్యభిచారిణి ముద్ర వేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పేర్కొంది. తనకు, తన కుమారుడికి ఎస్‌ఐతో ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని ఆ మహిళ ఉన్నతాధికారులను వేడుకున్నది.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వాడుకున్నాడు… బెదిరిస్తున్నాడు… ఎస్ఐతో మహిళకు ప్రాణహాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: