విరసం నేత వరవరరావు పరిస్థితి విషమం…?

ముంబయి : విరసం నాయకుడు వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని తలోజా జైలు అధికారులు వరవరరావు కుటుంబానికి సమాచారం అందించినట్టు తెలిసింది. జైలులో వరవరరావుకు చికిత్స అందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం తెలిసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావును అరెస్టు చేసి  జైలుకు తరలించిన విషయం విదితమే. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. […] The post విరసం నేత వరవరరావు పరిస్థితి విషమం…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : విరసం నాయకుడు వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని తలోజా జైలు అధికారులు వరవరరావు కుటుంబానికి సమాచారం అందించినట్టు తెలిసింది. జైలులో వరవరరావుకు చికిత్స అందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం తెలిసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావును అరెస్టు చేసి  జైలుకు తరలించిన విషయం విదితమే. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఉన్నందున , ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఐఎ కోర్టును కోరడంతో వరవరరావుకు బెయిల్ ఇవ్వలేదు. ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్ర చేశారన్న ఆరోపణలతో 2018 నవంబరులో వరవరరావును అరెస్టు చేశారు. మొదట ఆయన్ను పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి 2020 ఫిబ్రవరిలో ఆయనను తలోజా జైలుకు తరలించారు.  వరవరరావును విడుదల చేయాలని పలువురు విరసం నేతలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వరవరరావుకు హాని జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విరసం నేత వరవరరావు పరిస్థితి విషమం…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: