అంబేద్కర్ ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో మొక్కలు నాటిన పువ్వాడ

హైదరాబాద్ : ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ లోని అంబేద్కర్ ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవులను రక్షించుకున్నప్పుడే వాతావరణ సమతుల్యతను కాపాడడం, తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విధిగా ప్రతి ఒక్కరు ఆరు మొక్కలను నాటి సంరక్షించుకోవాలని ఆయన చెప్పారు. పచ్చని తెలంగాణను తయారు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని పువ్వాడ స్పష్టం చేశారు. […] The post అంబేద్కర్ ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో మొక్కలు నాటిన పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ లోని అంబేద్కర్ ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవులను రక్షించుకున్నప్పుడే వాతావరణ సమతుల్యతను కాపాడడం, తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విధిగా ప్రతి ఒక్కరు ఆరు మొక్కలను నాటి సంరక్షించుకోవాలని ఆయన చెప్పారు. పచ్చని తెలంగాణను తయారు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని పువ్వాడ స్పష్టం చేశారు. ఈ విషయంలో కెసిఆర్ లక్ష్య సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అంబేద్కర్ ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో మొక్కలు నాటిన పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: