నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల్లో కరోనా వైద్యం

  22 కళాశాలల్లో 11వేలు బెడ్లు సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్ కరోనా వైద్యులకు మెరుగైన వైద్యం ఇవ్వాలని సూచన మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల్లోనూ కరోనా వైద్యం అందనుంది. రోజురోజుకి రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 మెడికల్ కళాశాలల్లో 11వేల బెడ్లను ఏర్పాటు రోగులకు వైద్యం అందించాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను […] The post నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల్లో కరోనా వైద్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

22 కళాశాలల్లో 11వేలు బెడ్లు సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్
కరోనా వైద్యులకు మెరుగైన వైద్యం ఇవ్వాలని సూచన

మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల్లోనూ కరోనా వైద్యం అందనుంది. రోజురోజుకి రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 మెడికల్ కళాశాలల్లో 11వేల బెడ్లను ఏర్పాటు రోగులకు వైద్యం అందించాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరిధితో పాటు జిల్లాల్లోనూ అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గ్రేటర్ పరిధిలో కామినేని, ఒవైసి, నాచారం ఇఎస్‌ఐ, మల్లారెడ్డి, మెడికల్ కాలేజీలను పరిశీలించారు. అయితే హైదరాబాద్ పరిధిలో ఉన్న కాలేజీల్లో గురువారం నుంచే వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

22 కాలేజీలు… 11వేల బెడ్లు
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైద్యం అందించేందుకు ప్రభుత్వం 22 మెడికల్ కాలేజీలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనిలో 11 వేలు బెడ్లను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో 10వేలు జనరల్, వెయ్యి ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి కరోనా రోగులకు వైద్యం సేవలందించనున్నారు. దీంతో సిటీలో ఉండే ఆసుపత్రులపై భారం తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే కోవిడ్ నోడల్ కేంద్రాల్లో ముఖ్యమైన గాంధీ ఆసుపత్రిలో కేవలం క్రిటికల్ కండిషన్ రోగులకు మాత్రమే వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. తక్కువ, లక్షణాలే లేని పాజిటివ్‌లకు జిల్లా కేంద్రాల్లో లేదా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో కోవిడ్ పేషెంట్లను చేర్చుకోవాల్సిందిగా ఆయా యాజమాన్యాలకు మంత్రి సూచించారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల్లో కరోనా వైద్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: