వరల్డ్ కప్ ఫైనల్‌పై క్రిమినల్ విచారణ

  కొలంబో: భారత్‌తో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై క్రిమినల్ విచారణ జరపాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లంక ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని, ఈ క్రమంలో జట్టు ఆటగాళ్లకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని అప్పటి లంక క్రీడల మంత్రి మహీంద నంద సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న ప్రస్తుత లంక ప్రభుత్వం విచారణకు […] The post వరల్డ్ కప్ ఫైనల్‌పై క్రిమినల్ విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొలంబో: భారత్‌తో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై క్రిమినల్ విచారణ జరపాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లంక ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని, ఈ క్రమంలో జట్టు ఆటగాళ్లకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని అప్పటి లంక క్రీడల మంత్రి మహీంద నంద సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న ప్రస్తుత లంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీన్ని క్రిమినల్ కేసుగా పరిగణిస్తున్నట్టు శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రువాన్ చంద్ర మీడియాకు వెల్లడించారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు ఏమిటీ తెలుస్తామని రువాన్ స్పష్టం చేశారు.

 

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వరల్డ్ కప్ ఫైనల్‌పై క్రిమినల్ విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: