సెప్టెంబర్ లోనే ఐపిఎల్?

  ఓ స్పష్టతకు వచ్చిన బిసిసిఐ! ముంబై: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాడి అక్టోబర్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్ దాదాపు వాయిదా పడడంతో బిసిసిఐ ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీని కోసం నడుం బిగించాడు. ఇటు ఫ్రాంచైజీల యాజమాన్యాలు, అటు […] The post సెప్టెంబర్ లోనే ఐపిఎల్? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఓ స్పష్టతకు వచ్చిన బిసిసిఐ!

ముంబై: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాడి అక్టోబర్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్ దాదాపు వాయిదా పడడంతో బిసిసిఐ ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీని కోసం నడుం బిగించాడు. ఇటు ఫ్రాంచైజీల యాజమాన్యాలు, అటు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాడు.

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వరల్డ్‌కప్ జరగడం దాదాపు అసాధ్యంగా తయారైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికారికంగా ప్రకటన చేయక పోయినా ప్రపంచకప్ మాత్రం ఈ ఏడాది జరగడం కష్టమనే చెప్పాలి. క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చింది. నిర్ణీత సమయంలో వరల్డ్‌కప్ నిర్వహించడ తమ వల్ల కాదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఎర్లి ఎడ్డింగ్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నేడో రేపో ఐసిసి కూడా దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

కలవర పెడుతున్న కరోనా
ఒక వేళ బిసిసిఐ సెప్టెంబర్‌లో ఐపిఎల్ నిర్వహించాలని భావిస్తున్నా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తుందా లేదా అనేది సందేహంగా మారింది. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం క్రీడలకు సంబంధించి పలు సడలింపులు ఇవ్వడం కాస్త ఊరటనిస్తోంది. ఖాళీ స్టేడియాల్లో ఐపిఎల్‌తో సహా ఏ టోర్నీ నిర్వహించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రకటనను దృష్టిలో పెట్టుకుని బిసిసిఐ పావులు కదుపుతోంది.

ఖాళీ స్టేడియాల్లోనే..
ఇదిలావుండగా ఈ ఏడాది ఐపిఎల్ టోర్నమెంట్‌ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించడం ఖాయంగా మారింది. బిసిసిఐ కూడా ఐపిఎల్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. తొలుత కొంత మంది అభిమానుల మధ్య ఐపిఎల్‌ను నిర్వహించాలని భావించినా కరోనా తీవ్రత దృష్టా ఆ ప్రయత్నాలను బిసిసిఐ మానుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేడియాల్లో అభిమానులకు అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కరోనా మహమ్మరి రోజు రోజుకు విజృంభిస్తుండడంతో దేశంలో అల్లకల్లోల వాతావరణం నెలకొంది.

కానీ, జులై ఆఖరి నాటికి దేశంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఐపిఎల్‌ను ఎలాగైనా నిర్వహించాలనే లక్షంతో బిసిసిఐ పెద్దలు ఉన్నారు. మరోవైపు టీమిండియా క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపిఎల్‌లో ఆడేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఐపిఎల్ ఎప్పుడూ జరిగినా ఆడేందుకు తాము సిద్ధమేనని చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. క్రికెటర్లు, ఫ్రాంచైజీల యాజమాన్యాలు సిద్ధంగా ఉండడంతో బిసిసిఐ కూడా ఐపిఎల్ నిర్వాహణకే మొగ్గు చూపుతోంది.

కొన్ని వేదికల్లోనే మ్యాచ్‌లు!
కాగా, కరోనా మహమ్మరి నేపథ్యంలో ఐపిఎల్‌ను ఈ సారి కొన్ని వేదికల్లోనే నిర్వహించాలని బిసిసిఐ భావిస్తోంది. దీని కోసం రెండు నుంచి మూడు స్టేడియాలు ఉన్న నగరాలను వేదికగా ఎంచుకోవాలనే యోచనలో బిసిసిఐ ఉంది. ఇక, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దేశంలో వర్షాలు అధికంగా పడే అవకాశాలుంటాయి. దీంతో వేదికల ఎంపికలో ఈ విషయాన్ని కూడా బిసిసిఐ పరిగణలోకి తీసుకోంటోంది. ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై నగరాలను బిసిసిఐ వేదికలుగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇంత వరకు రాలేదు.

సెప్టెంబర్ 26 నుంచి టోర్నీ!
మరోవైపు అన్ని అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 26 నుంచి ఐపిఎల్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. నవంబర్ 8 వరకు ఐపిఎల్ టోర్నమెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బిసిసిఐ ఓ షెడ్యూల్‌ను కూడా రూపొందించిందని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆ కథనాల ప్రకారం ఐపిఎల్ సెప్టెంబర్‌లోనే ప్రారంభం కావడం ఖాయమ ని చెప్పాలి. ఫ్రాంచైజీల యాజమాన్యాలు కూ డా టోర్నీ నిర్వహణకు తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు సమాచారం.

BCCI planning to stage IPL 2020 between Sept 26

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సెప్టెంబర్ లోనే ఐపిఎల్? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: