పాకిస్థాన్ క్రికెట్‌లో కరోనా కల్లోలం

  లాహోర్ : పాకిస్థాన్ క్రికెట్‌ను కరోనా వైరస్ కుదిపేస్తోంది. మంగళవారం ఏకంగా ఏడుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్‌లో కల్లోలం నెలకొంది. ఇప్పటికే సోమవారం ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా ఉన్నట్టు తేలింది. తాజాగా మంగళవారం మరో ఏడుగురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఇది ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. త్వరలో ఇంగ్లండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో పలువురు క్రికెటర్లకు కరోనా సోకడంతో పాకిస్థాన్ క్రికెట్‌లో […] The post పాకిస్థాన్ క్రికెట్‌లో కరోనా కల్లోలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లాహోర్ : పాకిస్థాన్ క్రికెట్‌ను కరోనా వైరస్ కుదిపేస్తోంది. మంగళవారం ఏకంగా ఏడుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్‌లో కల్లోలం నెలకొంది. ఇప్పటికే సోమవారం ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా ఉన్నట్టు తేలింది. తాజాగా మంగళవారం మరో ఏడుగురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఇది ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. త్వరలో ఇంగ్లండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో పలువురు క్రికెటర్లకు కరోనా సోకడంతో పాకిస్థాన్ క్రికెట్‌లో కలవరం నెలకొంది. మంగళవారం ఏడుగురు క్రికెటర్లకు కరోనా నిర్ధారణ అయ్యిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారికంగా ప్రకటించింది. ఫకర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశిఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్‌నైన్, మహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్‌లకు కరోనా ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని పిసిబి ప్రకటించింది.

అంతకుముందు సోమవారం జరిపిన పరీక్షల్లో షాదాబ్ ఖాన్, హరీష్ రవూఫ్, హైదర్ అలీలకు కరోనా ఉన్నట్టు తేలిందని పిసిబి వివరించింది. ఈ పది మంది క్రికెటర్లు త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కావడం గమనార్హం. త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు టెస్టులు, ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇటీవలే 29 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కాగా, సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు ఈ నెల 28న ఇంగ్లండ్‌కు బయలు దేరాల్సి ఉంది. కాగా, సిరీస్ ప్రారంభం నాటికి క్రికెటర్లందరూ కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారనే నమ్మకంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిసిబి స్పష్టం చేసింది. చాలా మంది క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలినా సిరీస్ యథాతథంగా కొనసాగుతుందనే నమ్మకాన్ని పిసిబి అధికారులు వ్యక్తం చేశారు.

కాగా, కరోనా సోకిన క్రికెటర్లందరూ లాహోర్‌లోనే ఉంటారని తెలిపింది. ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందుకు క్రికెటర్లకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని పిసిబి వివరించింది. ఒకవేళ క్రికెటర్లకు కరోనా అని తేలినా వారిని స్వీయ నిర్బంధంలో ఉంచుతామని, పూర్తిగా కోలుకున్న తర్వాతే జట్టు తరఫున ఆడేందుకు అనుమతి ఇస్తామని పిసిబి వెల్లడించింది. ఇదిలావుండగా కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెటర్లను కరోనా మహమ్మరి కలవరానికి గురి చేస్తోంది. ఇంతకుముందే మరో ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. వీరిలో స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా ఉన్నాడు.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాకిస్థాన్ క్రికెట్‌లో కరోనా కల్లోలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: