నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ గుప్తాకు కరోనా

హైదరాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ గణేశ్ గుప్తాకు కరోనా సోకింది. ఇప్పటికే టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు బాజిరెడ్డి గోవర్ధన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలకు కరోనా సోకింది. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు కరోనా సోకడంతో టిఆర్‌ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా వీరికి కరోనా సోకింది. మొదటగా జనగామ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డికి, ఆ తర్వాత నిజామాబాద్ ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్థన్‌కు, ఇప్పడు నిజామాబాద్ […] The post నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ గుప్తాకు కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ గణేశ్ గుప్తాకు కరోనా సోకింది. ఇప్పటికే టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు బాజిరెడ్డి గోవర్ధన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలకు కరోనా సోకింది. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు కరోనా సోకడంతో టిఆర్‌ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా వీరికి కరోనా సోకింది. మొదటగా జనగామ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డికి, ఆ తర్వాత నిజామాబాద్ ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్థన్‌కు, ఇప్పడు నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ గణేశ్ గుప్తాకు పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణ ఎంఎల్‌ఎలు అప్రమత్తమయ్యారు. వారు ఇళ్లకే పరిమితమై టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ గుప్తాకు కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: