మాజీ లవర్‌ని చంపి…ఉరేసుకున్న ప్రియుడు

  గాంధీనగర్: మాజీ ప్రియురాలిని చంపి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రం ఛోటా ఉదపూర్ జిల్లాలోని నాస్వాడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాహుల్ భిల్(24) అనే యువకుడు, రేఖ తాడ్వి(21) అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో చెప్పకుండా సంవత్సరం కాలం పాటు సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. రేఖకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు మరో యువకుడితో […] The post మాజీ లవర్‌ని చంపి… ఉరేసుకున్న ప్రియుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గాంధీనగర్: మాజీ ప్రియురాలిని చంపి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రం ఛోటా ఉదపూర్ జిల్లాలోని నాస్వాడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాహుల్ భిల్(24) అనే యువకుడు, రేఖ తాడ్వి(21) అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో చెప్పకుండా సంవత్సరం కాలం పాటు సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. రేఖకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యుల నిర్ణయించడంతో ఆమెను చంపేస్తామని బెదిరించాడు. సోమవారం ఉదయం రాహుల్ పెద్ద పార తీసుకొని భిల్ ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి పక్కింట్లో వెళ్తుండగా ఆమెను పారతో తలపై మోదాడు. అనంతరం గొంతు, గదమపై పారతో పలుమార్లు కొట్టడంతో ఆమె ఘటనా స్థలంలో చనిపోయింది. వెంటనే అక్కడి నుంచి అడవిలోకి పారిపోయి భిల్ ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసులు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

The post మాజీ లవర్‌ని చంపి… ఉరేసుకున్న ప్రియుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: