లాక్‌డౌన్ కాలంలో 1461 రోడ్డు ప్రమాదాలు

750మరణాలు, మృతుల్లో 198 మంది వలస కార్మికులు  న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 198మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్టు సేవ్‌లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 25 నుంచి మే 31 వరకు దేశంలో కనీసం 1461 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాల్లో 750మంది చనిపోగా,1390మంది గాయపడ్డారని, మృతుల్లో 198మంది వలస కార్మికులని ఆ సంస్థ తెలిపింది. చనిపోయినవారిలో వలస కార్మికులు […] The post లాక్‌డౌన్ కాలంలో 1461 రోడ్డు ప్రమాదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
750మరణాలు, మృతుల్లో 198 మంది వలస కార్మికులు 

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 198మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్టు సేవ్‌లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 25 నుంచి మే 31 వరకు దేశంలో కనీసం 1461 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాల్లో 750మంది చనిపోగా,1390మంది గాయపడ్డారని, మృతుల్లో 198మంది వలస కార్మికులని ఆ సంస్థ తెలిపింది. చనిపోయినవారిలో వలస కార్మికులు 26.4 శాతం కాగా, సాధారణ కార్మికులు 5.3 శాతం, ఇతరులు 68.3 శాతమని నివేదిక పేర్కొన్నది.

అద్దె బస్సులు, ట్రక్కుల్లో వెళ్లడం, సరైన పర్యవేక్షణ లేక అడ్డదారుల్లో వెళ్లడం వల్ల ప్రమాదాలు అధికమయ్యాయని తెలిపింది. రోడ్డు ప్రమాద మృతుల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 245మంది(30 శాతం), తెలంగాణలో 56మంది, మధ్యప్రదేశ్‌లో 56 మంది, బీహార్‌లో 43మంది, పంజాబ్‌లో 38మంది, మహారాష్ట్రలో 36మంది ఉన్నారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగిన రాష్ట్రాలు వరుసగా ఉత్తర్‌ప్రదేశ్ 94, మధ్యప్రదేశ్ 38, బీహార్ 16, తెలంగాణ 11, మహారాష్ట్ర 9 ఉన్నాయి. ఈ లెక్కలన్నీ మీడియాతోపాటు పలు సమాచార వ్యవస్థల నుంచి సేకరించినట్టు సేవ్‌లైఫ్ తెలిపింది.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లాక్‌డౌన్ కాలంలో 1461 రోడ్డు ప్రమాదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: