ఆ ఐదు రాష్ట్రాలే కీలకం

 దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్‌పై పోరాటం ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి బయటపడి దేశీ య ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడంలో ఐదు రాష్ట్రాలు కీలకమని సర్వే చెబుతోంది. కేరళ, పంజాబ్, తమిళనా డు, హర్యానా, కర్ణాటక వంటి రాష్టాలు దేశీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని […] The post ఆ ఐదు రాష్ట్రాలే కీలకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం
ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం
గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్‌పై పోరాటం
ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి బయటపడి దేశీ య ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడంలో ఐదు రాష్ట్రాలు కీలకమని సర్వే చెబుతోంది. కేరళ, పంజాబ్, తమిళనా డు, హర్యానా, కర్ణాటక వంటి రాష్టాలు దేశీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఎల రా సెక్యూరిటీస్ అధ్యయనంలో తేలింది. భారతదేశం జిడిపి(స్థూల జాతీయోత్పత్తి)లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం ఉంది, నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ ట్రాక్‌లోకి రావాలంటే వీటి పాత్ర ముఖ్యమైంది. అయితే రెండు నెల ల తర్వాత కోవిడ్- లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ వాణిజ్య రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ కోవిడ్ 19 వైరస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంది.

విద్యుత్ వినియోగం పెరిగింది..

విద్యుత్ వినియోగం, ట్రాఫిక్ కదలిక, హోల్‌సేల్ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల రాక, గూగుల్ మొబిలిటీ డేటా, వంటి సూచికల విశ్లేషణ ఆధారంగా దేశ జిడిపిలో దాదాపు 27 శాతం వాటా ఉన్న ఐదు రాష్ట్రాలు కార్యాచరణలో పుంజుకున్నాయని ముంబైలోని ఎలారా సెక్యూరిటీస్ ఆర్థికవేత్త గరీమా కపూర్ నివేదికలో పేర్కొన్నారు. భారతదేశం కలిగి ఉన్న ఉత్తమ ఉద్దీపన సాధారణ ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని కపూర్ అన్నా రు. దేశం కార్యకలాపాల మెరుగుదలను చూస్తోంది, కానీ అది ఇప్పటికీ ఆశించినంతగా లేదని అన్నారు. నివేదిక ప్రకారం, పంజాబ్, హర్యానా విద్యుత్ అవసరాలలో మెరుగుదల కనిపించాయి. ఇది వ్యవసాయ కార్యకలాపాల నుండి వచ్చిన డిమాండును ప్రతిబింబిస్తుంది.

ఢిల్లీ లో విద్యుత్ డిమాండ్ పెరుగుదలతో పాటు కార్యకలాపా ల్లో పురోగతి ఉంది. అధ్యయనంలో తెలిసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లాక్‌డౌన్ విధించిన మొదట్లో మాదిరిగా ప్రజలు భయాందోళనలకు గురికావడం లేదు. రాబోయే నెలల్లో డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని కపూర్ చెప్పినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక వివరించింది. జూన్ 8 నుండి దశలవారీగా మతపరమైన ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ తెరవడం సహా విస్తృతమైన సడలింపుల ను శనివారం నాడు కేంద్రం ప్రకటించింది. కంటైన్‌మెం ట్ జోన్‌ను నిర్ధారించడానికి కేంద్రం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరిన్ని అధికారాలను ఇచ్చింది. ఏదేమై నా అంతర్జాతీయ విమాన ప్రయాణం, మెట్రో రైలు, సినిమా హాళ్ళు, జిమ్, స్విమ్మింగ్‌పూల్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, థియేటర్లు, బార్‌లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు ఇప్పటికీ రద్దు చేశారు.

Five Indian states are leading economy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ ఐదు రాష్ట్రాలే కీలకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: