సైన్యాన్ని దింపుతా

  మీకు చేతకావడం లేదు : రాష్ట్రాల గవర్నర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూయార్క్‌కు పాకిన నిరసనలు, ప్రశాంతంగా ఉండాలని ఫ్లాయిడ్ సోదరుడి విజ్ఞప్తి ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ చర్చలు, జి7కు రావాలని ఆహ్వానం అమెరికాలో అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ  చైనాతో సరిహద్దు ఉద్రిక్తత పైనా నేతల సంభాషణ జాత్యహంకారాన్ని నిరసించిన సత్యనాదెళ్ల న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు, కోవిడ్19 తదితర అంశాలపై అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ […] The post సైన్యాన్ని దింపుతా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మీకు చేతకావడం లేదు : రాష్ట్రాల గవర్నర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
న్యూయార్క్‌కు పాకిన నిరసనలు, ప్రశాంతంగా ఉండాలని ఫ్లాయిడ్ సోదరుడి విజ్ఞప్తి

ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ చర్చలు, జి7కు రావాలని ఆహ్వానం
అమెరికాలో అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ 
చైనాతో సరిహద్దు ఉద్రిక్తత పైనా నేతల సంభాషణ
జాత్యహంకారాన్ని నిరసించిన సత్యనాదెళ్ల

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు, కోవిడ్19 తదితర అంశాలపై అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ మధ్య మంగళవారం సుదీర్ఘ చర్చలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. జి7 సదస్సుకు రావాలని మోడీని ట్రంప్ ఆహ్వానించినట్టు ప్రభుత్వం తన ప్రకటనలో  నల్లజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అగ్రరాజ్యం అమెరికాలోఆందోళనలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో కర్ఫూ విధించారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరసనల మధ్య సోమవారం సాయంత్రం శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్ వద్ద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. అల్లర్లు అదుపు చేయడంలో రాష్ట్రాల గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే నేషనల్ గార్డ్‌ను రాష్ట్రాల్లోకి అనుమతించకపోతే సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశ శాంతి భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యమని, అందుకు తగిన చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రసంగించడానికి ముందు ఆందోళనకారులు శ్వేతసౌధం ఆవరణలోని పార్కు వద్దకు చేరుకుని శాంతియుతంగా నిరసనకు దిగారు. అయితే ట్రంప్ ప్రసంగం నేపథ్యంలో వారందరినీ అక్కడినుంచి చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. అంతకు ముందు ట్రంప్ రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. గవర్నర్లు బలహీనంగా ఉండడం వల్లే నిరసనలు ఈ స్థాయికి చేరాయని ఆరోపించారు. వీలయినంత త్వరా నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఆందోళనకారులను అరెస్టు చేయాలన్నారు. ‘మీరు వారిని వెంబడించండి… అరెస్టు చేయండి. పదేళ్ల పాటు జైళ్లలో పెట్టండి. అప్పుడు మరోసారి ఇలాం టి ఘటనలు జరగవు. వాషింగ్టన్ డిసిలో మేం అదే చేస్తు న్నాం. ప్రజలు ఇప్పటివరకు చూడని చర్యలు తీసుకోబోతున్నాం’ అని ట్రంప్ ఆగ్రహంగా అన్నారు. ఇవి శాంతియుత ఆందోళనలు కావని, అరాచక ప్రదర్శనలని మండిపడ్డారు. వాషింగ్టన్ నగరంలో చరిత్రాత్మక లింకన్ స్మారక చిహ్నాన్ని, రెండో ప్ప్రంచ యుద్ధం మెమోరియల్ ను, సెయింట్ జాన్ చర్చిని ధ్వసం చేశారని, వందలాది దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు దోచుకు పో యారని, ఇవి దేశీయ ఉగ్రవాద చర్యలన్నారు.
హింసమానండి: ఫ్లాయిడ్ సోదరుడి పిలుపు
మరో వైపు నిరసనకారులు హింసకు దిగడం మానాలని,శాంతియుతంగా ప్రదర్శపలు జరపాలని జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు టెర్రెన్స్ విజ్ఞప్తి చేశారు. మినియా పోలిస్‌లో ఫ్లాయిడ్‌ను పోలీసులు బలవంతంగా నొక్కిపెట్టి ప్రాణా లు కోల్పోయేలా చేసిన ప్రాంతంలో జరిగిన ఓ ప్రదర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హింస ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడ్ని తిరిగి తీసుకు రాలేదన్నారు.
జాత్యహంకారానికి తావు లేదు: సత్య నాదెళ్ల
సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి తావులేదని భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఇతరుల భావాలను అర్థం చేసుకొని గౌరవించడం, పరస్పర అవగాహన కేవలం ప్రారంభం మాత్రమేనని, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. నల్లజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఊపిరాడకపోవడం వల్లే ఫ్లాయిడ్ మృతి
జార్జ్ ఫ్లాయిడ్ (46)మృతితో అగ్రరాజ్యం అమెరికాలో ఆగ్రహ జ్వాలలు మిన్ను ముట్టుతున్న వేళ అధికారిక శవపరీక్ష నివేదిక విడుదలైంది. మెడమీద తీవ్రమైన ఒత్తిడి వల్ల ఊపిరాడకపోవడం వల్లే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జార్జ్ మరణించిన తీరును బట్టి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చని మెడికల్ ఎగ్జామినర్ అభిప్రాయపడ్డారు. మెడను బలంగా నొకిపెట్టడం వల్ల గుండె ఆగి జార్జ్ మరణించినట్లు స్పష్టం చేశారు. అయితే అప్పటికే ఆయన గుండె సంబంధిత, హైపర్‌టెన్షన్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. పైగా ఇటీవల ‘ఫెంటనిల్ ఇన్‌టాక్సికేషన్’, ‘మెథమ్ ఫెటమైన్’ అనే డ్రగ్స్ తీసుకున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

Trump serious on Governors over protest

India Concern on I Cann’t breather in US

The post సైన్యాన్ని దింపుతా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: