బంగారు తెలంగాణే కెసిఆర్ లక్ష్యం : ఎర్రబెల్లి

వరంగల్  : కెసిఆర్ ఉద్యమాాలు, అమరవీరుల త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి ఎర్రబెల్లి నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజల […] The post బంగారు తెలంగాణే కెసిఆర్ లక్ష్యం : ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్  : కెసిఆర్ ఉద్యమాాలు, అమరవీరుల త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి ఎర్రబెల్లి నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు మద్ధతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. మరో 20 ఏళ్ల పాటు టిఆర్ఎస్ అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అన్ని విధాల బాగు చేసి బంగారు తెలంగాణ తేవడమే ధ్యేయమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

The post బంగారు తెలంగాణే కెసిఆర్ లక్ష్యం : ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: