హరిత చరిత

  అభివృద్ధి, సంక్షేమాల అఖండ విజయం ఉద్యమ సారథ్యం నుంచి అధికార అగ్రాసనాన్ని అధిష్ఠించిన అరుదైన ముఖ్యమంత్రి… జనహృదయ పీఠాలలో చిరస్థానం పొందిన ప్రత్యేక రాష్ట్ర సాధకుడు… ఆరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని బహుముఖ అభివృద్ధి శిఖరం మీద ఉంచి దేశానికే మార్గదర్శిగా చరిత్రకెక్కిన సాటిలేని మేటి… తల్లి రుణం తీర్చిన బిడ్డ… తెలంగాణ వర పుత్రుడు కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం నేడు ఆరు వసంతాలు పూర్తి చేసుకుని అవతరణోత్సవం జరుపుకుంటున్నది. ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత మహోజ్వల […] The post హరిత చరిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అభివృద్ధి, సంక్షేమాల అఖండ విజయం

ఉద్యమ సారథ్యం నుంచి అధికార అగ్రాసనాన్ని అధిష్ఠించిన అరుదైన ముఖ్యమంత్రి… జనహృదయ పీఠాలలో చిరస్థానం పొందిన ప్రత్యేక రాష్ట్ర సాధకుడు… ఆరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని బహుముఖ అభివృద్ధి శిఖరం మీద ఉంచి దేశానికే మార్గదర్శిగా చరిత్రకెక్కిన సాటిలేని మేటి… తల్లి రుణం తీర్చిన బిడ్డ… తెలంగాణ వర పుత్రుడు కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం నేడు ఆరు వసంతాలు పూర్తి చేసుకుని అవతరణోత్సవం జరుపుకుంటున్నది. ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత మహోజ్వల భవిష్యత్తును చవిచూడాలని మన తెలంగాణ ఆకాంక్షిస్తున్నది.

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నోపోరాటాలు, మరెన్నోఉద్యమాలు, ప్రాణత్యాగాలు, ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమరణ దీక్ష ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ స్వరాష్ట్రం, సొంత పరిపాలన కోసం ఆరు ద శాబ్దాలపాటు సాగిన పోరాట చరిత్రలో ఎన్నో సంఘటనలు చరిత్ర పేజీల్లో నిలిచిపోయా యి. తెలంగాణ సాధన కోసం జరిగిన తొలి, మలి దశ ఉద్యమాలు జరిగిన తీరు, ఆ సందర్భంగా ఎదురైన సంఘటనలు గుర్తు చేసుకుంటే హృదయం చెమ్మగిల్లుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో 2001లో ప్రారంభమైన ఉద్యమం కెసిఆర్ నాయకత్వంలో13 ఏళ్లపాటు నిరంతరాయంగా కొనసాగింది. 2012లో పడిలేచిన కెరటమై వి జృంభించింది. పిల్ల, పెద్దా, ముసలి, ముత కా, పేద, ధనిక తేడాలేకుండా తెలంగాణ సాధనే లక్షంగా ప్రాణాలను పణంగా పెట్టి పల్లె పల్లె నుంచి పట్టణాలవరకు, గల్లీ నుంచి ఢిల్లీ వ రకు తెలంగాణ గొంతు సంఘటితమై వినిపించింది. ఢిల్లీ గద్దెను గడగడ లాడించింది. రా ష్ట్రంలో ఏవైపు చూసినా, ఎవరిని కదిలించినా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అగుపించింది. కళాకారులు గళమెత్తారు. కవులు కలాలను ఝ ళిపించారు. విద్యార్థులు ఉద్యమంలో పరుగు లు తీశారు. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు తమ పనులను పక్కకు పెట్టి తరతరాల ఆంధ్రదోపిడికి వ్యతిరేకంగా, తెలంగాణ సాధనే లక్షంగా ఉద్యమక్షేత్రంలోకి ఉరికిన సంఘటనలు భారతదేశ చరిత్రలో కేవలం తెలంగాణకే సొంతమయ్యాయి.

ఊపిరులు ఊదిన ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ లక్షసాధనగా ఆవిర్భవించిన టిఆర్‌ఎస్ పార్టీ గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో త్యాగాలు చేయాల్సివచ్చింది. టిఆర్‌ఎస్ పార్టీ గురించి చెప్పుకోవడం అంటే గులాబి జెండా గురించి చెప్పుకోవడమే. అయితే గులాబీ జెండాను, కెసిఆర్‌ను వేరు చేసి చూడలేము. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 1969వరకు ఒక చరిత్ర అయితే మలిదశ ఉద్యమం మరో చరిత్రగా రూపాంతరం చెందింది. ఆంధ్రవలసవాద సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వం స్పృహ ఆరిపోకుండా ఉండటానికి ఎందరో నాయకులు కృషి చేశారు. 1969నాటి ఉద్యమం అణగారిపోయిన అనంతరం ఆశలు సన్నగిల్లాయి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించే మరో నాయకుడు వస్తాడని జనం ఆశగా ఎదిరి చూశారు. ప్రజల నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండాను చేతపూని కెసిఆర్ తెలంగాణ సాధన ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. చినుకుగా ప్రారంభమైన ఉద్యమం అనతికాలంలోనే తుఫాన్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాలను మార్చివేసింది. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట 2001 ఏప్రిల్ 27న తెలంగాణ జాతిని విముక్తి చేయడానికి కెసిఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలిఅడుగు వేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగల భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సమితిది ప్రత్యేక చరిత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే నాలుగు సార్లు శాసనసభ్యుడుగా, రెండు పర్యాయాలు మంత్రిగా విధులు నిర్వహించిన కెసిఆర్ డిప్యూటీ స్పీకర్‌పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో దూకారు. రాజకీయ ప్రక్రియద్వారనే ప్రత్యేక తెలంగాణ సాకారమవుతందనే బలమైన విశ్వాసంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 2001 మే17న తెలంగాణ సింహగర్జన భారీ బహిరంగ సభలోనే రాజకీయ పోరాటంతోనే తెలంగాణ సాధిస్తామని ప్రకటించారు. ఆనాటి నుంచి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు ప్రారంభమయ్యాయి. 2004ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టిఆర్‌ఎస్ పొత్తుపెట్టుకుని కరీంనగర్ బహిరంగసభలో సోనియాగాంధీతో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపచేశారు. రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని చేర్చడం ఒక మైలురాయి . కేంద్ర ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ చేరిన అనంతరం 35 పార్టీల అభిప్రాయాలను తెలంగాణకు అనుకూలంగా తీసుకురావడంతో తెలంగాణ సాధనకు మార్గం సుగమనం చేసిన ఎత్తుగడగా విశ్లేషకులు అభివర్ణిస్తారు.

కెసిఆర్ చచ్చుడో… తెలంగాణ తెచ్చుడో
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటానికి ప్రధాన కారణం కెసిఆర్ ప్రాణత్యాగానికిసిద్ధమవడం. కెసిఆర్ చచ్చుడో… తెలంగాణ తెచ్చుడో తేలిపోవాలంటూ టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమంలో దూకడంతో ఒక్కసారి తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైంది. ప్రాణాలకు తెగించి కెసిఆర్ 2009 నవంబర్ 29న ఆమరణదీక్ష ప్రారంభించారు. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆయనను అరెస్టు చేసి నిజాం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోనే కెసిఆర్ ఆమరణదీక్ష చేపట్టడంతో తెలంగాణ సమాజం బగ్గుమంది. కెసిఆర్ ఆరోగ్యం క్షీణించిందని తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలో భాస్వాములయ్యారు. ఆసుపత్రిలో కెసిఆర్ లేవలేని పరిస్థితుల్లో, మృత్యువుతో పోరాడుతున్న సమయంలో 2009 డిసెంబర్ 9న ఆనాటి హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కేంద్రం ప్రకటనను నమ్మి కెసిఆర్ దీక్ష విరమించారు. ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అయితే దీక్ష విరమించిన కొద్దిగంటల్లోనే యుపిఎ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. దీంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. త్యాగాల కొలిమిగా తెలంగాణ మారింది. విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. కళాశాలు పూర్తిగా ఉద్యమంలో పాల్గొనాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనడంతో తెలంగాణ ఉద్యమం ఊహించని మలుపు తిరిగింది. విద్యార్థులను కట్టడి చేసేందుకు కేంద్ర పోలీసు బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. లాఠీఛార్జీలు, ఫైరింగ్‌లతో తెలంగాణలో యుద్ధ వాతావరణం నెలకొంది.

తెలంగాణ సమాజం పూర్తిగా ఉద్యమబాటలో నిలిచింది. విద్యార్థులు ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోసం 2009 డిసెంబర్ 3న శ్రీకాంతాచారి ప్రజల సమక్షంలో ప్రాణత్యాగం చేయడంతో ఉద్యమం సెగలు గక్కింది. విద్యార్థులు సచివాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధం కావడంతో పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించి ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు మరింత బలపడ్డాయి. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్భందం, వంటావార్పులతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అయితే తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ ఆంధ్రనాయకులు రాజీనామాల పర్వం కొనసాగించి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని ప్రయత్నించారు. తెలంగాణ సాధనకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణా కమిటీని ఏర్పాటుచేసి తెలంగాణ ఏర్పాటు అంశంపై నివేదిక కోరింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కమిటీ ఏర్పాటు పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొండంతో 2 జూన్2014న తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమనేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టారు. ఉద్యమనేత ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ బంగారు తెలంగాణగా ఆవిర్భవించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏ లక్షం కోసం తెలంగాణ ఆవిర్భించిందో ఆ లక్షసాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ అనేక అభివృద్ధి మైలురాళ్లను దాటుతూ ఏడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

తొలి, మలిదశ ఉద్యమ స్వరూపం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలివిడత 1969లో ప్రారంభమైంది. జై తెలంగాణ నినాదంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లింది. మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమంలో 369మంది విద్యార్థులు చనిపోగా ప్రభుత్వం మాత్రం 57 మంది విద్యార్థులు మృతిచెందినట్లు లెక్కలు చెప్పింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా కేంద్రం అణచివేసింది. ఆ తర్వాత 2001లో కె.చంద్రశేఖర్ రావు టిఆర్‌ఎస్ పార్టీని స్థాపించి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి గమ్యానికి చేర్చారు. ఈ పోరాటంలో అనేక కీలక ఘట్టాలు చోటి చేసుకున్నాయి.

Telangana Formation day 2020

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హరిత చరిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: