తక్కువ చేసి చూడొద్దు

కోల్‌కతా: తన భర్త, భారత క్రికెటర్ మనోజ్ తివారీపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై అతని భార్య సుష్మితా రాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమిండియాలో విఫలమైన ఆటగాళ్లు వీరేనంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. ఇందులో భారత క్రికెటర్ మనోజ్ తివారీ పేరు కూడా ఉంది. ఎన్నో అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేక పోయిన పదకొండు మంది క్రికెటర్ల జాబితాను ఇటీవల కొందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో […] The post తక్కువ చేసి చూడొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్‌కతా: తన భర్త, భారత క్రికెటర్ మనోజ్ తివారీపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై అతని భార్య సుష్మితా రాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమిండియాలో విఫలమైన ఆటగాళ్లు వీరేనంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. ఇందులో భారత క్రికెటర్ మనోజ్ తివారీ పేరు కూడా ఉంది. ఎన్నో అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేక పోయిన పదకొండు మంది క్రికెటర్ల జాబితాను ఇటీవల కొందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో మనోజ్ తివారీ పేరు కూడా ఉంది. దీనిపై అతని భార్య సుష్మిత తీవ్రంగా స్పందించింది. ఇలాంటి తప్పుడూ వార్తలు ప్రచురితం చేసే ముందు క్రికెటర్ల అభిప్రాయాలు తీసుకోవడం మంచిదని సూచించింది.

టీమిండియాలో తన భర్తకు కొన్ని అవకాశాలు మాత్రమే లభించాయని, అయినా దాన్ని అతను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడని వివరించింది. మరి కొంత కాలం క్రికెట్ ఆడే అవకాశం మనోజ్‌కు ఉందని, ఏదో ఒక రోజు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే సత్తా ఉందని పేర్కొంది. కాగా, ఎంతో ప్రతిభావంతుడైన మనోజ్‌ను విఫల క్రికెటర్‌గా పరిగణిస్తూ ఫొటో పోస్ట్ పెట్టడం బాధకు గురి చేసిందని సుష్మిత వాపోయింది.

Cricketer Manoj Tiwari’s wife fire on his inclusion

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తక్కువ చేసి చూడొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: