దసరాకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ: వేముల ప్రశాంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఆరు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన ఉద్యమ నాయకుడైన కెసిఆర్ పాలనలో తెలంగాణ కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లారన్నారు. రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టి, […] The post దసరాకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ: వేముల ప్రశాంత్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఆరు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన ఉద్యమ నాయకుడైన కెసిఆర్ పాలనలో తెలంగాణ కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లారన్నారు.

రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టి, ఆచరణలో చేసి చూపించారన్నారు. పేదవారి ఆత్మగౌరవ ప్రతీక అయిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారని, ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరిధిలో, రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుందన్నారు. ఈ దసరాకు 1లక్ష ఇళ్లు పేదలకు అందించి సామూహిక గృహ ప్రవేశాలకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనాలు నిర్మించుకోవడం జరిగిందని, ఈనెల చివరినాటికి 10 భవనాలు, ఈ ఏడాది చివరికి పూర్తి భవనాల నిర్మాణం పూర్తి కానున్నట్టు ఆయన తెలిపారు.

1 Lakhs Double bed room houses distribute on Dasara

The post దసరాకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ: వేముల ప్రశాంత్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: