ప్రజలకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఒకటో తేదీనే ప్రజలకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను పెంచాయి. దీంతో గ్యాస్ వినియోగదారులపై ఈ ప్రభావం పడింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.11.5 పెరగడంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.110 పెరిగింది. దీంతో […] The post ప్రజలకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: ఒకటో తేదీనే ప్రజలకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను పెంచాయి. దీంతో గ్యాస్ వినియోగదారులపై ఈ ప్రభావం పడింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.11.5 పెరగడంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.110 పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,139లయ్యింది.
కాగా, మే నెలలో వంట గ్యాస్ ధర రూ.744 నుంచి రూ.581.50కి తగ్గించారు. దీనికి కారణం అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు తగ్గడమే. అయితే జూన్ నెల వచ్చేసరికి అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు పెరిగాయి. అందువల్ల తాము పెంచాల్సి వచ్చిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. కాగా ఈ పెంపు ప్రధానమంత్రి ఉజ్వల్ స్కీమ్ లబ్ధిదారులకు వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది. ఈ లబ్ధిదారులు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీంలో భాగంగా జూన్ 30 వరకు ఉచిత సిలిండర్ పొందే అవకాశం ఉంది.

Domestic Cooking Gas Price Raised from June 1

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రజలకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: