విద్యుత్ రంగంపై కేంద్రం కుట్రలు సాగనివ్వం..

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని టిఈఈజేసీ కన్వీనర్ ఎన్. శివాజీ హెచ్చరించారు. సోమవారం విద్యుత్ సౌధలో జేఏసీ ఆద్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన విద్యుత్ సవరణ చట్టంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ శివాజీ మాట్లాడుతూ..ఒక వైపు ప్రపంచం అంతా కరోనా విజృంభణతో భయబ్రాంతులకు లోనవుతుంటే కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్ సవరణ చట్టం అమలు చేయడం సిగ్గుచేటన్నారు. నూతన చట్టం ద్వారా రాష్ట్రప్రభుత్వ […] The post విద్యుత్ రంగంపై కేంద్రం కుట్రలు సాగనివ్వం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని టిఈఈజేసీ కన్వీనర్ ఎన్. శివాజీ హెచ్చరించారు. సోమవారం విద్యుత్ సౌధలో జేఏసీ ఆద్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన విద్యుత్ సవరణ చట్టంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ శివాజీ మాట్లాడుతూ..ఒక వైపు ప్రపంచం అంతా కరోనా విజృంభణతో భయబ్రాంతులకు లోనవుతుంటే కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్ సవరణ చట్టం అమలు చేయడం సిగ్గుచేటన్నారు. నూతన చట్టం ద్వారా రాష్ట్రప్రభుత్వ అధికారాలను కత్తిరించి, ఎలక్ట్రిసిటీని పూర్తిగా కేంద్రప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చే విధంగా ఉన్నాయన్నారు. విద్యుత్ చట్టం సవరణతో మొత్తం విద్యుత్ వ్యవస్థలను ఆదానీలు, అంబానీలకు దారాదత్తం చేసే పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. వైస్ ఛైర్మన్ అంజయ్యలు మాట్లాడుతూ.. పేద, ధనిక వర్గాల మధ్య విద్యుత్ ధరలను సర్దుబాటుకు ఆస్తారం కల్పించే క్రాస్ సబ్సిడిని పూర్తి ఎత్తివేసే ప్రతిపాదన చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలను కాపాడుతుందని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టసవరణ బిల్లును పార్లమెంట్‌లో సిఎం కెసిఆర్ వ్యతిరేకిస్తామని చెప్పడం ఇప్పటికే చెప్పారని ఆయన గుర్తు చేశారు. కరోనా పేరుతో 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజి అంటు హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం అందులో డిస్కింకు ప్రయోజనం కల్పించే ఒక్క పనికూడా చేయకుండా దొడ్డిదారిలో కార్పోరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించే విధంగా చేస్తుందన్నారు. కరోనా పరిస్థితుల చక్కబడ్డతర్వాల భాగస్వాములతో చర్చలు జరిపి విద్యుత్ చట్ట సవరణ అంశంలో ముందుకు తీసుకెళ్ళాలన్నారు. ఈ కార్యక్రమంలో టి జాక్ నాయకులు కోడూరి ప్రకాష్, రామేశ్వర్‌శెట్టి, జాన్సన్, వినోద్, గణేష్‌రావు, నాజర్, ఆరోగ్యరాణి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

TEEJAC Crisis to Center over Power Sector

The post విద్యుత్ రంగంపై కేంద్రం కుట్రలు సాగనివ్వం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: