సర్‌ప్రైజ్‌గా ఫస్ట్‌లుక్ వీడియో

  భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రాకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశచెందారు. లాక్ డౌన్ మొదలయ్యే నాటికే ఈ సినిమా షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది. ఇక లాక్ డౌన్‌లో రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారన్న వార్తలు రావడంతో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ని పరిచయం చేస్తారని అనుకున్నారు అంతా. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఎలాంటి ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయడం లేదని ‘ఆర్ఆర్ఆర్’ […] The post సర్‌ప్రైజ్‌గా ఫస్ట్‌లుక్ వీడియో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రాకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశచెందారు. లాక్ డౌన్ మొదలయ్యే నాటికే ఈ సినిమా షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది.

ఇక లాక్ డౌన్‌లో రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారన్న వార్తలు రావడంతో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ని పరిచయం చేస్తారని అనుకున్నారు అంతా. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఎలాంటి ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయడం లేదని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనానికి ఎంత త్వరగా అడ్డుకట్ట వేస్తే అంత మంచిదని రాజమౌళి భావిస్తున్నారట.

అందుకే ఆయన షూటింగ్ మొదలుకాగానే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో తేవాలనే ఆలోచనలో ఉన్నారట. గతంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం సరిపడా షూటింగ్ మెటీరియల్ లేదని చెప్పిన రాజమౌళి… ఎన్టీఆర్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి ఫస్ట్ లుక్ వీడియో సిద్ధం చేయాలని భావిస్తున్నారట. కాబట్టి ఆర్ఆర్ఆర్ షూటింగ్ షురూ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక తీరినట్లే. అలాగే ఈ వీడియోను కూడా సర్‌ప్రైజ్‌గా విడుదల చేస్తారని సమాచారం.

First Look Video as Jr NTR Surprise from RRR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సర్‌ప్రైజ్‌గా ఫస్ట్‌లుక్ వీడియో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: