పాక శాస్త్రంలో తన ప్రావీణ్యాన్ని చూపిస్తోంది

  కరోనా లాక్‌డౌన్‌ని సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు కిచెన్‌లో నోరూరించే వంటలు చేస్తుంటే మరికొందరు మొక్కలు పెంపకం వంటి వ్యాపకాలతో సరిపెట్టుకున్నారు. కొందరైతే ఆన్‌లైన్‌లో కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఇక పలువురు బాలీవుడ్ నాయికలు ఇళ్లలో యోగా, ధ్యానం, వ్యాయమాలు చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతున్నారు. ఇకపోతే అందాలతార కాజల్ అగర్వాల్ ఈ లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. ఈ బ్యూటీ పాక శాస్త్రంలో తన ప్రావీణ్యం ఏపాటిదో చూపిస్తోంది. […] The post పాక శాస్త్రంలో తన ప్రావీణ్యాన్ని చూపిస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా లాక్‌డౌన్‌ని సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు కిచెన్‌లో నోరూరించే వంటలు చేస్తుంటే మరికొందరు మొక్కలు పెంపకం వంటి వ్యాపకాలతో సరిపెట్టుకున్నారు.

కొందరైతే ఆన్‌లైన్‌లో కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఇక పలువురు బాలీవుడ్ నాయికలు ఇళ్లలో యోగా, ధ్యానం, వ్యాయమాలు చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతున్నారు. ఇకపోతే అందాలతార కాజల్ అగర్వాల్ ఈ లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. ఈ బ్యూటీ పాక శాస్త్రంలో తన ప్రావీణ్యం ఏపాటిదో చూపిస్తోంది. ప్రత్యేకించి బేకరీ ఐటమ్స్ తయారు చేయడంలో తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది.

కిచెన్‌లో రకరకాల బేకరీ ఐటమ్స్‌ను తయారు చేసి వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా కాజల్ తాను తయారు చేసిన కేక్‌లు, చాక్లెట్లు తదితర ఫుడ్ ఐటమ్స్ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వీటి తయారీలో ఈ బ్యూటీ ఆరితేరిందట. అదేవిధంగా కాజల్ ఫిట్ నెస్‌పై కూడా దృష్టి పెట్టిందట.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాక శాస్త్రంలో తన ప్రావీణ్యాన్ని చూపిస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: