చారిత్రక చిత్రానికి పెద్ద దెబ్బ

  ఒకప్పుడు క్లాసిక్ చిత్రాలతో దక్షిణాదిలో సంచలన సృష్టించిన దర్శకుడు మణిరత్నం. ఈ ప్రముఖ దర్శకుడి మ్యాజిక్ ఇప్పుడు అంతగా పని చేయడం లేదు. దక్షిణాదిన ప్రముఖ దర్శకుడిగా ఆయన పేరు నాడు మారుమోగింది. నేడు సరైన హిట్టు కోసం ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మణిరత్నం రూపొందిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ భారీ చిత్రంలో విక్రమ్, కార్తి, శరత్ కుమార్, జయం రవి, ప్రభు, జయరామ్, […] The post చారిత్రక చిత్రానికి పెద్ద దెబ్బ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒకప్పుడు క్లాసిక్ చిత్రాలతో దక్షిణాదిలో సంచలన సృష్టించిన దర్శకుడు మణిరత్నం. ఈ ప్రముఖ దర్శకుడి మ్యాజిక్ ఇప్పుడు అంతగా పని చేయడం లేదు.

దక్షిణాదిన ప్రముఖ దర్శకుడిగా ఆయన పేరు నాడు మారుమోగింది. నేడు సరైన హిట్టు కోసం ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మణిరత్నం రూపొందిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ భారీ చిత్రంలో విక్రమ్, కార్తి, శరత్ కుమార్, జయం రవి, ప్రభు, జయరామ్, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్య, లక్ష్మీ తదితర భారీ తారాగణం నటిస్తోంది. వీరిపై థాయ్‌లాండ్ అడవుల్లో కీలకమైన దృశ్యాలను చిత్రీకరించారు. ఆతర్వాత చెన్నైలో భారీ సెట్టింగ్ లు నిర్మించి షూటింగ్ జరపాలని మణిరత్నం నిర్ణయించారు. అయితే కరోనా వ్యాప్తితో షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ చిత్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

చారిత్రిక సినిమా కావడంతో ప్రభుత్వం సినిమాలకు అనుమతి ఇచ్చినా ఇందులో వందలాది మంది సైనికులుగా నటించాల్సి ఉంది. ఇప్పుడు కరోనా బాగా ప్రబలడంతో ఇంతమందితో షూటింగ్ నిర్వహించడం కష్టమే. వందల సంఖ్యలో ఫెఫ్సీ కార్మికులతో యుద్ధ సన్నివేశాలకు ప్లాన్ చేసిన మణిరత్నం ఇప్పుడు కరోనా దెబ్బకు ఎలా తీయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. దీంతో కరోనా తగ్గిపోయే దాకా.. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం షూటింగ్ కు సుధీర్ఘ విరామం ప్రకటించి సంచలనం సృష్టించారు మణిరత్నం. ఈ లోగా అరవింద్ స్వామితో ఓ కొత్త సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు లాక్ డౌన్‌లోనే కొత్త కథకు స్రిప్ట్‌ను కూడా మణిరత్నం సిద్ధం చేసినట్లు తెలిసింది.

Mani Ratnam on filmmaking in post-lockdown world

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చారిత్రక చిత్రానికి పెద్ద దెబ్బ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: