దోమకొండలో ఉమాపతిరావు అంత్యక్రియలు

  కామారెడ్డి : దోమకొండ గడికోట వారసుడు కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు, హీరో రాంచరణ్, ఆయన భార్య ఉపాసన హాజరయ్యారు. ఈ నెల 26న అనారోగ్యంతో మరణించిన కామినేని ఉమాపతిరావు పార్ధివ దేహాన్ని ఉదయం 9 గంటల నుంచి 11గంటల వరకు దోమకొండ కోటలో సందర్శనార్ధం ఉంచారు. అనంతరం గ్రామ శివారులోని లక్ష్మిభాగ్‌లో అంత్యక్రియ లు నిర్వహించారు. […] The post దోమకొండలో ఉమాపతిరావు అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కామారెడ్డి : దోమకొండ గడికోట వారసుడు కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించారు.

ఈ అంత్యక్రియలకు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు, హీరో రాంచరణ్, ఆయన భార్య ఉపాసన హాజరయ్యారు. ఈ నెల 26న అనారోగ్యంతో మరణించిన కామినేని ఉమాపతిరావు పార్ధివ దేహాన్ని ఉదయం 9 గంటల నుంచి 11గంటల వరకు దోమకొండ కోటలో సందర్శనార్ధం ఉంచారు. అనంతరం గ్రామ శివారులోని లక్ష్మిభాగ్‌లో అంత్యక్రియ లు నిర్వహించారు. సందర్శన అనంతరం ఆయన పార్ధివ దేహన్ని దహన సంస్కారాల కోసం తరలిస్తున్న సమయంలో తేనె టీగల గుంపు నటుడు చిరంజీవి, ఇతర బంధువులపై దాడికి దిగడంతో అందరూ పరుగులు తీశారు.

తేనెటీగల దాడి తరువాత పార్ధివ దేహన్ని దహన సంస్కారాల కోసం లక్ష్మిబాగ్‌కు తరలించారు. ఉమాపతిరావు దేహానికి ఆయన కొడుకు అనిల్‌కుమార్ దహన సంస్కారాలు నిర్వహించారు. ఉమాపతిరావు పార్ధివ దేహనికి జిల్లా కలెక్టర్ శరత్‌కుమార్, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంటు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, వెంకటేష్ దోతెలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఉమాపతిరావు అంత్యక్రియలకు హాజరు కావడంతో సిఐ యాలాద్రి, ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంచాల శేఖర్, ఎంపిపి కోట సదానంద, జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, ఐరేని నర్సయ్య, ఉపసర్పంచ్ గజవాడ శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు తహసీల్దార్ అంజయ్య, ఆర్‌ఐ నరేందర్, వీఆర్వో జమాల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దోమకొండలో ఉమాపతిరావు అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: