లాక్‌డౌన్‌పై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష

  కేంద్రం జారీ చేసిన 5.0 మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చ మరిన్ని సండలింపులు ఇచ్చేందుకే మొగ్గు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగింపు, ఆంక్షల సండలింపులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేడు సమీక్షించనున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుతో ఆయన సమావేశం కానున్నారు. లాక్‌డౌన్ 5.0పై తాజాగా కేంద్ర జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో సిఎం కూలంకషంగా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ను కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పొడగించింది. అలాగే […] The post లాక్‌డౌన్‌పై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేంద్రం జారీ చేసిన 5.0 మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చ
మరిన్ని సండలింపులు ఇచ్చేందుకే మొగ్గు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగింపు, ఆంక్షల సండలింపులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేడు సమీక్షించనున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుతో ఆయన సమావేశం కానున్నారు.

లాక్‌డౌన్ 5.0పై తాజాగా కేంద్ర జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో సిఎం కూలంకషంగా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ను కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పొడగించింది. అలాగే కర్వూ వేళల్లో కూడా సడలింపులు ఇచ్చింది. ఇప్పటి వరకు కర్పూ రాత్రి 7 నుంచి తెల్లవారు 7 వరకు కొనసాగుతోంది. అయితే కేంద్ర తాజాగా కర్ఫూ రాత్రి 9నుంచి ఉదయం 5గంటల వరకు కుదించింది. ఇక 8వ తేదీ నుంచి లాక్‌డౌన్‌లోనూ పలు సండలింపులు ఇచ్చింది. ప్రధానంగా అన్ని వర్గాలకు చెందిన ప్రార్ధనా మందిరాలను ఆ రోజు నుంచి తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలకు సంబంధించిన సంస్థలు, షాపింగ్ మాల్స్‌ను కూడా తెరుచుకునేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

వీటిని తెరవడానికి అవసరమైన మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపులుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో అమలు జరగుతున్న అమలు తీరు, నిబంధనలపై ఇచ్చిన పలు సడలింపులపై ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆరా తీయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మరోసారి సిఎం చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు అధికారంగా ఉన్న ప్రాంతాలనే కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది.

అయినప్పటికీ కరోనా మహమ్మారి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై నేటి సమావేశంలో కెసిఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. కేంద్రం దారిలోనే రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడగించడంతో పాటు కేంద్రం ఇచ్చిన సడలింపులు కూడా రాష్ట్రంలో ఇచ్చి జూన్ 8వ తేదీ నుంచి మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతించాలా? లేదా అన్న విషయంపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 8వ తేదీ నుంచి జిహెచ్‌ఎంసిలో పరిధిలో సిటీ బస్సులను తిప్పడంతో పాటు మెట్రోరైల్ నడపడంపై కూడా చర్చించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

CM KCR Review On Lockdown today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లాక్‌డౌన్‌పై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: